మామకేనా ఆయనక్కూడానా?

సామ్ ని అక్కినేనీస్ కి లక్కీ మస్కట్ అనొచ్చేమో!! ఎందుకా డౌట్? మొన్ననే ఆయన(చై)కు మజిలీ సక్సెస్  గిఫ్ట్ గా ఇస్తున్నానని చెప్పిన సామ్ అన్నట్టే చేసింది.. మజిలీ కథ సెలక్షన్ నుంచి ప్రతిదాంట్లో సామ్ ఇన్ పుట్స్ ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీకి అదిరిపోయే హిట్ దక్కింది. చైతన్య ఇమేజ్ పెంచిన చిత్రంగా మజిలీ రికార్డులకెక్కింది. అంతకుముందు `మనం` సక్సెస్ లో కుటుంబ సభ్యులందరితో పాటు తన షేర్ కూడా ఉంది. అలాగే కింగ్ నటించిన `రాజుగారి గది 2`లో పూర్తి స్థాయి పాత్రలో సామ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇక తదుపరి మామ నటిస్తున్న `మన్మధుడు 2` కి తన ఛామింగ్ కామియో అడ్వాంటేజ్ కానుంది. తాను అతిధిగా కనిపిస్తే సెంటిమెంటుగా అయినా మన్మధుడు 2 బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమేనని అక్కినేని ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. ఆ అతిధి పాత్ర గురించి కింగ్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. అయితే సమంత కేవలం ఈ సినిమాతోనే అతిధి పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా? అంటే కానేకాదని అర్థమవుతోంది.

అక్కినేని హీరోలు నటించే ఏ సినిమాలో అయినా సమంత కామియోలు చేసేందుకు సిద్ధమేననడంలో సందేహమేం లేదు. తనకోసం క్రియేట్ చేసే కామియోలో మ్యాటర్ ఉండాలి అంతే. అలాంటి ప్రయత్నమే `వెంకీ మామ` కోసం చేస్తున్నారా? అంటే ఏమో ఏమైనా జరగొచ్చనే ఊహిస్తున్నారు. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ కశ్మీర్ అందాల నడుమ శరవేగంగా పర్తవుతోంది. అక్కడికి సమంత తన పర్సనల్ స్టాఫ్ సహా దిగిపోవడమే కాదు గత మూడు రోజులుగా హబ్బీతో కలిసి చాలానే హంగామా చేస్తోందట. తనతో పాటే వ్యక్తిగత డిజైనర్ - మేకప్ మేన్ కూడా ఉండడంతో ఒకటే సందేహాలు నెలకొన్నాయి. బహుశా సామ్ వెంకీమామ లో ఏదైనా కామియో చేస్తోందా? అంటూ ఫ్యాన్స్ లో ఒకటే సందేహం. అలా కాకుండా కశ్మీర్ అందాల నడుమ ఏదైనా ఫోటో షూట్ లో పాల్గొనబోతోందా? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. అయినా మావయ్యకేనా కామియోలు.. ఆయనకు లేవా? అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తిగా చర్చ సాగుతోంది. సామ్ దీనిపై క్లారిటీ ఇస్తుందేమో?


× RELATED 'పవర్ స్టార్' స్టిల్స్ పై పవన్ స్పందన ఇదేనట?
×