ఇస్మార్ట్ పూరి మార్క్ రొమాన్స్

దర్శకులెందరు ఉన్నా పూరి వేరు. ఆయన శైలి వేరు. మాస్ కి మస్త మజా ట్రీటివ్వాలంటే పూరి వల్లనే సాధ్యం. అయితే ఇటీవల ట్రాక్ దారి తప్పడం కొంత ఇబ్బందికరమే అయినా ఈసారి ఎందుకనో పూరి సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ అంటూ రామ్ ని కొత్త లుక్ లో దించినప్పుడే ఈసారి పూరి ఈజ్ బ్యాక్ ఎగైన్ అంటూ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ కనిపించాయి. ఈసారి ఏదో కొత్తగా మరింత ఊర మాసుగా ఇంకేదో చేస్తున్నాడు అంటూ ఇమాజినేషన్ లోకి వెళ్లారు పూరి ఫ్యాన్స్.

మరి అన్నంత పనీ చేస్తాడా లేదా? అన్నది తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాలి. మొన్న రిలీజైన మాస్ సింగిల్ `దిమాక్ ఖరాబ్` బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మణిశర్మ ఈజ్ బ్యాక్ అంటూ పొగిడేశారంతా. పూరి ఈసారి దిమాక్ ఖరాబ్ చేయడం గ్యారెంటీ అని మాట్లాడుకున్నారు. ఆ క్రమంలోనే ఇదే ఊపులో మరో అదిరిపోయే సింగిల్ ని రిలీజ్ చేస్తోంది టీమ్.  ఈసారి `జిందాబాద్ జిందాబాద్` అంటూ సాగే మరో కొత్త పాటను జూన్ 14 సాయంత్రం 5గం.లకు లాంచ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కిర్రెక్కించింది.

ఈ పోస్టర్ లో ఇస్మార్ట్ శంకర్ చెలరేగిపోయాడు. హీరోయిన్ తో బీచ్ ఒడ్డున రొమాన్స్ పీక్స్. పూల చొక్కాయ్ .. ట్రెండీ జీన్స్ లో రామ్ ఊర మాస్ లుక్ తో అదరగొడుతున్నాడు. హ్యార్లీ డేవిడ్ సన్ బైక్ బీచ్ ని షేక్ చేస్తోంది. పూరి మార్క్ పోస్టర్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో నభా నటేష్- నిధి అగర్వాల్ అందచందాలు యూత్ కి స్పెషల్ ట్రీట్ నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో సినిమా రిలీజ్ కానుంది.
× RELATED 'పవర్ స్టార్' స్టిల్స్ పై పవన్ స్పందన ఇదేనట?
×