ఫోటో స్టొరీ: స్టన్నింగ్ లేడి.. బ్రైట్ నెస్ ఎక్కువ!

నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాదే అయినా పెరిగింది మాత్రం బెంగుళూరులో.  అందుకే ఈ భామను బెంగుళూరు భామ అంటున్నారు.  బాలీవుడ్ ఫిలిం 'మున్నా మైఖేల్' తో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి 'సవ్యసాచి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత 'Mr.మజ్ను' లో నటించింది. ప్రస్తుతం చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా సోషల్ మీడియాలో మంటలు రేపే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది.

నిధికి తన ఇన్స్టా ఖాతాలో 3.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఎలా చూసుకున్నా ఓ కొత్త హీరోయిన్ కు ఈ ఫాలోయింగ్ ఎక్కువే. అయినా తన ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకునేందుకు.. ఫిలిం మేకర్లకు తన గ్లామర్ యాంగిల్ ను కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ఘాటు పోజులు ఇస్తోంది. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు నిధి ఇచ్చిన క్యాప్షన్ "ఇది గుడ్ బేబీ గర్ల్".  ఫోటోలో నిధి 'బేబీ గర్ల్' అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉండే ఒక బంగారు లాకెట్ లాంటిదాన్ని చేతులతో వయ్యారంగా పట్టుకొని తన మునిపంటి కింద పెట్టి పోజిచ్చింది.  వైట్ షర్ట్ ను బటన్స్ పెట్టుకోకుండా జస్ట్ ముడి వేసుకుంది.  ఈ షర్టుకు కాంబినేషన్ గా ఒక జీన్స్ ప్యాంట్ ధరించింది. షర్టును ఎంతో జాగ్రత్తగా నెటిజనులకు వ్యూ కు ఇబ్బంది లేకుండా ముడి పెట్టుకోవడంతో అదో అందమైన బికినీ టాప్ లాగా కనిపిస్తోంది.. అందాల విందు చేస్తోంది.  బ్లీచ్ చేసి సైడ్ కు స్టైలింగ్ చేసిన హెయిర్ కావడంతో మోడరన్ లుక్ లో కనిపిస్తోంది.

ఈ ఫోటోకు ఇన్స్టా ఫాలోయర్ల రెస్పాన్స్ భారీగానే ఉంది. "బ్యూటీ నాట్ అడ్మైర్డ్ ఈజ్ ఎ సిన్.. యు ఆర్ బ్యూటిఫుల్".. "దేవుడు నిన్ను తీరిగ్గా తయారు చేసి ఉంటాడు".. "కికాస్ బ్యూటీ.. ఝకాస్ పోజ్".. "స్టన్నింగ్ లేడి.. బ్రైట్ నెస్ ఎక్కువ" అని డిఫరెంట్ కామెంట్లు పెట్టారు.  లాస్ట్ కామెంట్ చేసిన నెటిజనుడు సూపర్ గా అబ్జర్వ్ చేశాడు.. నిజంగానే ఫోటోకు బ్రైట్ నెస్ ఎక్కువైంది.  ఇక ఈ స్టన్నింగ్ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే 'ఇస్మార్ట్ శంకర్' త్వరలో రిలీజ్ కానుంది.  హిందీలో 'ఇక్కా'.. 'మాస్క్' అనే సినిమాలకు సైన్ చేసింది. త్వరలో ఈ సినిమాల షూటింగ్ ప్రారంభం అవుతుందట.


× RELATED ఫోటో స్టోరీ: వైట్ డ్రెస్ లో రకులిజిం
×