జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేసిన ఎమ్మెల్యే!

ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఈ రోజు అసెంబ్లీలో కన్నుల పండువగా సాగింది. అధికార.. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించేందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ప్రోటెం స్పీకర్ గా శంబంగి అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేశారు.

అయితే.. రోటీన్ కు భిన్నంగా ప్రమాణం చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన అధినేత జగన్ మీద అభిమానాన్ని ఆయన ప్రదర్శించారు. తన ప్రమాణస్వీకారం సందర్భంగా దైవసాక్షిగా అని ప్రమాణం చేయటానికి బదులుగా జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. పొర పాటుగా ఆయన ఆ విధంగా పలకటంతో ఆయన చేత మరోసారి ప్రమాణం చేయించారు. అయితే.. జగన్ మీద తనకున్న అభిమానం ఆయన ప్రమాణంలో కనిపించిందన్న మాట వినిపించింది. ఇక.. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. స్పీకర్ ఎన్నిక గురువారం జరగనుంది.× RELATED సీఎం జగన్ అరెస్టు పై ఉండవల్లి షాకింగ్ కామెంట్స్ | Undavalli Controversial Comments On AP CM Jagan
×