జిమ్ బయట పహారా కాయాల్సిందే

సరిగ్గా నాలుగేళ్ల క్రితం జాన్వీ డెబ్యూ గురించి అప్పుడప్పుడే ప్రచారం మొదలైంది. మీడియా దృష్టి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ పైకి మళ్లింది అప్పుడప్పుడే కావడంతో మరీ అంతగా ఫోకస్ లేదు. అప్పటికి జాన్వీ పబ్లిక్ అప్పియరెన్స్ కూడా అంతంత మాత్రమే. ముంబైలో ఏదైనా ఫేజ్ 3 ఫంక్షన్ జరిగితే అక్కడ మామ్ శ్రీదేవితో పాటు కనిపించేది. సిస్టర్ ఖుషీ కపూర్ తో ఆడుకుంటూ కనిపించేది. అప్పటికి ఇప్పటికి జాన్వీలో ఎంతటి మార్పు?

అసలు మామ్ శ్రీదేవి ఫేజ్ 3 వరల్డ్ లో ఎలా దూసుకెళ్లాలో జాన్వీకి టిప్స్ చెబుతున్నారంటూ ప్రచారమైంది. పైపెచ్చు ఫిలింమేకర్ కరణ్ జోహార్ ప్రత్యేకించి జాన్వీకి ట్రైనింగ్ ఇస్తున్నాడని తన డెబ్యూ మూవీ ధడక్ కంటే ముందే ప్రచారమైంది. జాన్వీని పెద్ద స్టార్ ని చేసేందుకు శ్రీదేవి- బోనీ జోడీ ఎంతో ప్రణాళిక సిద్ధం చేసి తనను ఈ రంగుల ప్రపంచంలోకి పంపేందుకు ఎంతో ముందస్తు ప్రిపరేషన్ సాగించారు. అయితే అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి ఆకస్మిక మరణం జాన్వీని కుంగదీసిన సంగతి తెలిసిందే.

అయినా జాన్వీ ఏమాత్రం భయపడిపోలేదు. ఈ రంగుల ప్రపంచంలో తన కెరీర్ గురించి దిగులు చెందకుండా సత్తా చాటడమే ధ్యేయంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా మామ్ టిప్స్ ప్రకారం ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం రాజీకి రావడం లేదు. అంతకుమించి రకరకాల కారణాలతో మీడియా అటెన్షన్ ని తనవైపు తిప్పేసుకుంటూ జాన్వీ నిరంతరం వార్తల్లో నానుతోంది. అయితే ఈ టిప్స్ అన్నిటినీ మామ్ ఇచ్చారా.. లేక కరణ్ జోహార్ ఇచ్చారో కానీ ఇది బాగానే వర్కవుటవుతోంది. జాన్వీ జిమ్ కెళ్లినా.. షాపింగ్ కి వెళ్లినా.. లేదా ఏదైనా పబ్లిక్ రెస్టారెంట్ కి వెళ్లినా అక్కడ ప్రత్యేకించి డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేస్తూ చూపరుల దృష్టిని తనవైపు తిప్పేసుకుంటోంది. చుట్టూ ఎందరు ఉన్నా అందరూ తననే చూడాలి! అన్న ఫార్ములాని తూ.చ తప్పక అమల్లో పెడుతోంది. ముఖ్యంగా జాన్వీ జిమ్ కి వెళితే బయట పహారా కాయాల్సిందే. లేదంటే కుర్రాళ్లంతా మూకుమ్మడిగా మీద పడడం ఖాయం. శరీరాన్ని అతుక్కుపోయే టైట్ పిట్ డ్రెస్ లు ధరిస్తూ వెర్రెత్తిస్తోంది. ఓసారి అయితే ఏకంగా నిక్కరు వేయడమే మర్చిపోయిందా..! అనిపించే టైట్ డ్రెస్ లో వీధుల్లోకి వచ్చేయడంతో పరేషాన్ అవ్వడం బోయ్స్ వంతైంది. మొత్తానికి ఫేజ్ 3 వరల్డ్ ని ఎలా ఏలాలో ఈ అమ్మడికి చాలాబాగానే వంట పట్టిందని అర్థమవుతోంది. జాన్వీ లేటెస్ట్ ఔటింగ్ ఇది. ముంబైలోని ఓ రద్ధీ ఏరియాలో ఇలా జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ బ్లాక్ జిమ్ వేర్ లో మతి చెడగొట్టింది. పిక్కలపైకి పొట్టి నిక్కరు.. పాక్షికంగా అందాల ఎలివేషన్ హైలైట్ అయ్యింది కదూ? జాన్వీ ప్రస్తుతం గుంజన్ సక్సేనా బయోపిక్ తో పాటు తక్త్ అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    

× RELATED మెగా హీరోలు జిమ్ వదిలిపెట్టరా?
×