ట్రోలర్ల వేధింపులు.. మెగా హీరో పోలీసులకు ఫిర్యాదు

సోషల్ మీడియాలో ఉన్న నెగెటివ్ అంశాల్లో ఒకటి ట్రోలింగ్.  ఎంత పెద్ద స్టార్లయినా.. హీరోలయినా ట్రోలింగ్ బారినుండి తప్పించుకోలేరు.  ఫేక్ ఖాతాల ద్వారా ట్రోలింగ్ చేయడం రోజురోజుకూ ఎక్కువవుతోంది.  రీసెంట్ గా మెగా ఫ్యామిలీ హీరో.. మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఈ ట్రోలింగ్ బారిన పడ్డాడు.

గత కొంత కాలంగా కొందరు నెటిజన్లు ఫేక్ అకౌంట్స్ ద్వారా కళ్యాణ్ ను అసభ్యకరమైన భాషలో దూషిస్తున్నారట.  ఏదో ఒకసారి అయితే పట్టించుకోకుండా ఉండేవారు కానీ ఇది చాలారోజుల నుండి కొనసాగుతూ ఉండడంతో కళ్యాణ్ దేవ్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడట. కళ్యాణ్ దేవ్ ఆ ట్రోలర్ల ఎకౌంట్ వివరాలు.. వారు పెట్టిన అభ్యంతరకరమైన మెసేజుల స్క్రీన్ షాట్ లను పోలీసులకు అయిదు రోజుల క్రితమే అందజేశాడట.   వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారట.

ఈ వివరాలు అందుకున్న సైబర్ క్రైమ్ వారు సదరు ట్రోలర్ల వివరాలు అందజేయాలని ఇన్ స్టాగ్రామ్ వారికి లేఖ రాశారట.  ఇన్ స్టాగ్రామ్ అధికారుల నుండి ఆ నెటిజనుల వివరాలు రాగానే ట్రోలర్లపై చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ వారు వెల్లడించారు.
× RELATED నటి శ్రీరెడ్డిపై కరాటే కళ్యాణి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు
×