ముద్దొస్తున్న సామ్ బేబీ : ఫస్ట్ లుక్

పెళ్ళయాక కూడా దూకుడు ఏ మాత్రం తగ్గించకుండా గ్లామర్ రోల్స్ కన్నా పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్న సమంతా మజిలీ ఇచ్చిన సక్సెస్ కిక్ తో యమా ఉత్సాహంగా ఉంది. గత ఏడాది మూడు బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో మజిలీతో టాలీవుడ్ కు మంచి బోణీ ఇచ్చింది. చైతుతో సమానంగా తనకు సక్సెస్ క్రెడిట్ ని ప్రేక్షకులు ఇవ్వడం చూస్తే తన ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పకనే చెబుతోంది

ఇప్పుడీ జోష్ తో సామ్ మరో కొత్త సినిమాతో రాబోతోంది. అదే ఓ బేబీ. అలా మొదలైంది ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సురేష్ సంస్థతో మరో మూడు బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిన్న సురేష్ సంస్థ 55 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు సమంతా ఎప్పటి లాగే క్యూట్ లుక్స్ అండ్ స్మైల్ తో అదరగొట్టగా వెనకాల పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో సీనియర్ లక్ష్మిని చూపించి స్టోరీ థీమ్ ని చెప్పించే ప్రయత్నం చేశారు.

70 ఏళ్ళ బామ్మా అనూహ్యంగా 20 ఏళ్ళ యువతిగా మారాల్సి వస్తే జరిగే పరిణామాలు ఆధారంగా ఇది రూపొందింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్ అని టాక్. ఎబిసిడితో పేరు తెచ్చుకున్న జూదా శాండీ సంగీతం అందిస్తున్నాడు. లుక్ పరంగా సమంతా సినిమా మీద ఆసక్తిని రేపింది. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించని లక్ష్మి గారికి చాలా ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ డీలక్స్ తర్వాత అలాంటి ఛాలెంజింగ్ రోల్ మరొకటి దక్కినందుకు సామ్ ఆనందం మాములుగా లేదు


× RELATED 'పవర్ స్టార్' స్టిల్స్ పై పవన్ స్పందన ఇదేనట?
×