దారి కనిపించని బాలయ్య దర్శకుడు ?

వినయ విదేయ రామ కనీసం యావరేజ్ అయినా బోయపాటి శీను గ్రాఫ్ ఇంకోలా ఉండేదేమో కాని మరీ దారుణమైన డిజాస్టర్ కావడంతో అతని మీద చాలా ప్రభావం చూపించిన మాట వాస్తవం. ఎన్టీఆర్ ముందు వరకు సినిమా చేస్తానని మాట ఇచ్చిన బాలకృష్ణ అనూహ్యంగా కెఎస్ రవికుమార్ ని లైన్ లో పెట్టడం ఎవరూ ఊహించనిది. దర్శకులకు హిట్టు ఫ్లాపు కామనే అయినప్పటికీ చేతి దాకా వచ్చిన ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు జీర్ణించుకోవడం అంత ఈజీ కాదు.

ఇప్పుడు కాకపోయినా బోయపాటి తర్వాతైనా బాలయ్యతో చేస్తాడు అది వేరే సంగతి. ఇదిలా ఉండగా ఆ లోపు ఎవరైనా క్రేజీ హీరోతో ఓ మీడియం బడ్జెట్ మూవీ చేయాలన్న బోయపాటి ప్లాన్స్ అంతగా వర్క్ అవుట్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు .ఆరెక్స్ 100 ఫేం కార్తికేయతో చేస్తాడని ఓ టాక్ వచ్చింది. కాని అతను ఏకకాలంలో నాలుగు సినిమాల షూటింగ్స్ తో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు.

పోనీ తనను ఓసారి అడిగిన అఖిల్ ను ట్రై చేస్తే తనూ బొమ్మరిల్లు భాస్కర్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అదీ కుదిరేలా లేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఇద్దరు అప్ కమింగ్ యూత్ హీరోలతో వేరే రచయిత ఇచ్చిన కథతో బోయపాటి ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇదీ ప్రకటించే దాకా నమ్మలేని విషయమే. అయితే బోయపాటికి ఇలాంటి ఆప్షన్ తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్నాడు. ఏదో ఒకటి త్వరగా మొదలుపెట్టి కంబ్యాక్ ఇస్తే తప్ప కుదుటపడలేని పరిస్థితి నెలకొంది

    

× RELATED సల్మాన్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ని కలుపుతారా?
×