ప్రభాస్ ఇంకో రైటర్ కి లైఫ్ ఇస్తాడా ?

ఇప్పుడు కొరటాల శివ పేరు మారుమ్రోగిపోతోంది కానీ తనకు మొదటి సినిమా మిర్చి అవకాశం ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ ను అతని అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. బాహుబలి షూటింగ్ జరుగుతున్న పీక్స్ టైం లోనూ దీనికి డేట్స్ ఇచ్చిన హీరో నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటిదాకా స్టార్ హీరోలతో చేసిన నాలుగు సినిమాలతోనూ పరాజయం ఎరుగకుండా సాగుతున్నాడు కొరటాల శివ.

రైటర్ ఎంత టాలెంట్ ఉన్న వాడైనా అతనిలో దర్శకత్వ ప్రతిభ ఉందొ లేదో గుర్తించడం అంత ఈజీ కాదు. ఇదే తరహాల్ వక్కంతం వంశీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య చేస్తే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇదిలా ఉండగా మరో సంభాషణల రచయిత ప్రభాస్ హీరోగా కెప్టెన్ గా మారేందుకు రంగం సిద్ధమవుతోందన్న వార్త ఫిలిం నగర్ లో గుప్పుమంటోంది

మాటల ద్వారా భావాలను అద్భుతంగా పలికిస్తారని పేరు తెచ్చుకున్న బుర్రా సాయి మాధవ్ కంచె నుంచి ఎన్టీఆర్ దాకా ప్రతి సినిమాలోనూ తూటాల్లాంటి సంభాషణలు రాశారు. శాతకర్ణి ఖైదీ నెంబర్ 150 ఒకే టైంలో ఇద్దరు అగ్ర హీరోలకు అదిరిపోయే మాటలు అందించడం ఆయనకే చెల్లింది. వచ్చిన టాక్ ప్రకారం దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందట.

ప్రభాస్ ఇంకా పక్కాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనప్పటికీ లైన్ నచ్చి డెవలప్ చేయమని చెప్పాడట. దీంతో సాయి మాధవ్ అదే పనిలో ఉన్నట్టు తెలిసింది. సాహో రిలీజ్ అయ్యాక రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ షూటింగ్ కంటిన్యూ చేస్తూనే నెక్స్ట్ మూవీ కి సంబంధించిన నిర్ణయం ప్రభాస్ తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

    

× RELATED నాది బోరింగ్ లైఫ్ వర్కౌట్ అవ్వదు : మహేష్
×