'సాహో' పై స్వీటీ షాకింగ్ కామెంట్

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సాహో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. ఆ మేరకు యు.వి.క్రియేషన్స్ సంస్థ అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తేదీని లాక్ చేశామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా సాహో ఇప్పటికే ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఆ క్రమంలోనే ట్రేడ్ లోనూ అంతకంతకు ఆసక్తి రెయిజ్ అవుతోంది. తాజాగా రివీల్ చేసిన కొత్త లుక్ లో ప్రభాస్ స్టన్నింగ్ అప్పియరెన్స్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. సామాజిక మాధ్యమాల్లో బిగ్ డిబేట్ కి తావిచ్చింది. ఈ కొత్త పోస్టర్ పై పలువురు సెలబ్రిటీలు హాట్ కామెంట్స్ చేశారు. కొందరు ప్రశంసలు కురిపించారు. అయితే ఎందరు ఎలా ప్రశంసించినా డార్లింగ్  హృదయానికి ఎంతో చేరువైన స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి ఈ లుక్ పై ఏమన్నారు? అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంతకీ స్వీటీ ఏమన్నారు? అంటే..

``సాహో నుంచి వస్తున్న ప్రతిదీ.. నెక్ట్స్ ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు స్కైలోకి వెళుతున్నాయి. ఆగస్ట్ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్ కు - యూవీ క్రియేషన్స్ కు.. సుజిత్ కు.. టీమ్ లోని ప్రతి టెక్నీషియన్ కు ఆల్ ది బెస్ట్. ఎంతో ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నా`` అని ఫేస్ బుక్ పోస్టర్ తో పాటుగా ఆసక్తికర వ్యాఖ్యను పోస్ట్ చేశారు.

డార్లింగ్ ప్రభాస్ విషయంలో ఏ పాయింట్ అయినా స్వీటీని ఎగ్జయిట్ చేస్తుంది. ఎందుకంటే తన మనసుకు ఎంతో దగ్గరైన స్నేహితుడు ప్రభాస్. ప్రతి ఒక్కరినీ డార్లింగ్ అంటూ ఎంతో స్వీట్ గా పలకరించే అతడి మనస్తత్వం అంటే అందరికీ ఇష్టం. స్వీటీ అనుష్క శెట్టి అంతే అభిమానిస్తారు. ఇకపోతే అనుష్క నటిస్తున్న తాజా చిత్రం `సైలెన్స్` ఎంతవరకూ వచ్చింది? అంటే .. శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతోందని తెలుస్తోంది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్ - అంజలి - షాలినీ పాండే - సుబ్బరాజు - అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు-తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
× RELATED నో కామెంట్ అంటూనే నోరు జారాడు
×