దిల్ రాజుకు షాక్ ఇచ్చిన సూపర్ స్టార్

ఇండస్ట్రీకి తన సక్సెస్ లతో షాక్ ఇచ్చే అగ్ర నిర్మాత దిల్ రాజు కొన్నీ రోజులు క్రిందట సూపర్ స్టార్ మహేశ్ నుంచి ఓ షాక్ తగిలిందట - మహేశ్ బాబు నుంచి తాజాగా వచ్చిన మహర్షీకి నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని పరిస్ధితిలో ప్రస్తుతం ఉన్నట్లుగా తెలిసింది. ఇప్పటి వరకు దిల్ రాజు కాంపౌండ్ లోనే ఉంటూ వరుస సక్సెస్ లు అందుకున్న అనిల్ రావిపూడి - తన నెక్ట్స్ మూవీని మహేశ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ కాంబినేషన్ ని దిల్ రాజు సెట్ చేయాలనుకున్నాడట - అయితే అనిల్ రావిపూడి టాలెంట్ ని రాజ ది గ్రేట్ టైమ్ లోనే గ్రహించిన మహేశ్ బాబు - తన కోసం ఓ కథ రెడీ చేయాల్సిందిగా సూచించాడట అయితే అనిల్ రావిపూడికి అప్పటికే ఎఫ్ 2 కమిట్మెంట్ ఉండటంతో మహేశ్ కి కథ రెఢీ చేసే టైమ్ దొరకలేదట - కానీ ఎఫ్ 2 షూట్ స్టార్ట్ అయ్యాక - కొంత జాప్యం రావడంతో ఆ గ్యాప్ ని మహేశ్ కథ కోసం వేచించి - ఓ కమర్షీయల్ కథను రెఢీ చేశాడని తెలిసింది.

ఈ స్టోరీ అంతా ఎఫ్ 2 టైమ్ లో జరిగినా దిల్ రాజుకి ఇది ఏ మాత్రం తెలియకుండా జరిగందట ఎఫ్ 2 రిలిజ్ అవ్వడం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మహేశ్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ని తన కాంపౌండ్ లోనే సెట్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నించగా మహేశ్ నుంచి ఈ షాకింగ్ న్యూస్ తెలిసుకున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మీరు ఎఫ్ 2 నిర్మించే టైమ్ లోనే మీకు తెలియకుండా నేను అనిల్ రావిపూడిని పిలిచి నా కోసం కథను సిద్ధం చేయించుకున్నా అని దీనికి నిర్మాతగా అనిల్ సుంకర గారు వ్యవహరించబోతున్నారని మహేశ్ - దిల్ రాజుకు షాక్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే దిల్ రాజు ఈ సినిమాకు ప్రెజంటర్ గా వ్యవహరించే అవకాశం ఉందనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని తెలిసింది.

× RELATED మోడీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎంపీ .. జీఎస్టీ మోడీ పిచ్చి చర్య !
×