'సాహో' పోస్టర్ కు కాపీ మరకలు

ఒకప్పుడు ఏ హాలీవుడ్ హిట్ సినిమా డీవీడీనో పక్కన పెట్టుకుని ఉన్నదున్నట్లుగా సినిమా తీసేసినా జనాలకు తెలిసేది కాదు. కానీ ఈ రోజుల్లో చిన్న పోస్టర్ కాపీ కొట్టినా పట్టేస్తున్నారు. సోషల్ మీడియా పవర్ అది మరి. ఏదో ఒక పోస్టర్ చూసి.. చిన్న చిన్న మార్పులు చేసి తమదైన క్రియేటివిటీతో పోస్టర్లు రెడీ చేసి నెటిజన్లకు దొరికిపోతున్నారు ఫిలిం మేకర్స్ ఎవరైనా ప్రశ్నిస్తే తాము యాజిటీజ్ ఎక్కడుంది అంటారు. అది కాపీ కాదు. ఇన్స్పిరేషన్ అంటున్నారు. డిజైనర్స్. తాజాగా విడుదలైన ‘సాహో’ పోస్టర్లోనూ ఇలాంటి ‘ఇన్స్పిరేషన్’యే కనిపించింది. ‘బ్రేకింగ్ బ్యాడ్’ అనే అమెరికన్ టీవీ సిరీస్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను కాపీ కొట్టి ‘సాహో’ లేటెస్ట్ పోస్టర్ తయారు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

‘బ్రేకింగ్ బ్యాడ్’ - ‘సాహో’ పోస్టర్లను పక్క పక్కన పెట్టి చూస్తే చాలా వరకు పోలికలు కనిపిస్తున్నాయి. ‘బ్రేకింగ్ బ్యాడ్’లోని నటుడి తరహాలోనే ప్రభాస్ లుక్ ఉంది. ఇద్దరి చూపూ ఒకేలా ఉంది. ఇద్దరూ కళ్లజోడు పెట్టుకున్నారు. ఆ కళ్లజోడు డిజైన్ కొంచెం ఉద్దేశపూర్వకంగానే మార్చినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ‘సాహో’ లుక్ రిలీజైన కొన్ని గంటలకే ఈ కాపీ ఆరోపణలతో సోషల్ మీడియా హీటెక్కింది. ప్రభాస్ చివరి సినిమా ‘బాహుబలి’కి సైతం ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. శివగామిని నదిలో బిడ్డను ఒంటిచేత్తో ఎత్తుకున్న ‘బాహుబలి’ ఫస్ట్ లుక్ కు సైతం కాపీ మరకలు అంటాయి. కాకపోతే రాజమౌళి అండ్ టీం సైతం ఉన్నదున్నట్లు దించేయకుండా మార్పులు చేర్పులతో ఏదో మేనేజ్ చేసినట్లు కనిపించింది.
   

× RELATED NTR-30 పోస్టర్ తో సైరన్ మోగించారుగా
×