ఖామోషి ట్రైలర్.. కిల్లర్ ప్రభు- పెయింటర్ మిల్కీ

మిల్కీ బ్యూటీ లీడ్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'ఖామోషి'.  ఈ సినిమాలో ప్రభుదేవా సీరియల్ కిల్లర్ పాత్రలో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో తమన్నా బధిరురాలైన చిత్రకారిణి పాత్రలో నటిస్తోంది. భూమిక మరో కీలక పాత్రలో నటిస్తోంది.  చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈమధ్యే రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే ఒక పెద్ద బంగాళాలో నివాసం ఉంటూ తమన్నా పెయిటింగ్స్ వేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ బంగాళా తనది అంటూటూ ప్రభుదేవా ఆ బంగాళా దగ్గరకు వస్తాడు. ఇంతలో ఆ బంగాళాకు వెనకున్న గ్యాస్ స్టేషన్ లో రెండు హత్యలు జరుగుతాయి. ఫైనల్ గా తమన్నాకు కూడా కిల్లర్ ప్రభుదేవా ఎదురుపడతాడు. మరి ప్రభుదేవా బారి నుండి తమన్నా తనను తాను కాపాడుకోగలిగిందా లేదా అనేది కథ. క్రైమ్ థ్రిల్లర్లలో సహజంగా ఉండే సస్పెన్స్ ఎలిమెంట్ ఈ సినిమాలో కూడా ఉంది. అలా అని మరీ ట్రైలర్ కొత్తగా ఏమీ లేదు.   ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా 2016 లో రిలీజ్ అయిన హాలీవుడ్ థ్రిల్లర్ 'హష్' కు కాపీ అనే మాట వినిపిస్తోంది.  'ఖామోషి' ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది నెటిజనులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  సినిమా రిలీజ్ అయితే కానీ మనకు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రాదు. ఫ్రీమేకో.. ఇన్స్పిరేషనో  లేకపోతే ఒరిజినల్లో ఏదో ఒకటి.. ముందైతే ట్రైలర్ చూసేయండి!


 
× RELATED ట్రైలర్ టాక్: అందుకే ఈ ప్యానిక్ అటాక్స్
×