ఊహించనివి చేస్తానంటున్న మాజీ హీరొయిన్

బాలీవుడ్ హీరొయిన్ టబు అంటే మన ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వెంకటేష్ కూలి నెంబర్ వన్ తో పరిచయమయ్యాక నాగార్జున నిన్నే పెళ్ళాడతాతో ఓ రేంజ్ గుర్తింపు తెచ్చేసుకుంది. అందులో పండు పాత్ర పేరు ఎంత పాపులారిటీ తెచ్చిందో అందరికి గుర్తే. హీరొయిన్ గా మానేశాక కొంత గ్యాప్ తీసుకున్న టబు ఆ మధ్య బాలకృష్ణ పాండురంగడులో చేసింది కాని అది డిజాస్టర్ కావడంతో ఫలితం దక్కలేదు.

తాజాగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీ చేస్తున్న టబు కొత్త సినిమా దే దే ప్యార్ దే రేపు విడుదల కానుంది. అజయ్ దేవగన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో టబు గర్ల్ ఫ్రెండ్ మాయలో పడ్డ మాజీ భర్తను రక్షించుకునే పాత్ర చేస్తోంది

ఇలాంటి టిపికల్ రోల్స్ చేయడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగుందని ఇప్పుడు కాదు ముందు ముందు ఊహించని పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తాను అని చెబుతోంది. చాలా వెరైటీగా అనిపించే రోల్స్ వస్తున్నాయని బాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఒప్పుకుంటున్నానని చెప్పింది.

అయితే టబు కెరీర్ ఇంతగా స్పీడ్ అందుకోవడానికి కారణం మాత్రం అందాదున్ సినిమానే. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే హత్య చేసే సైలెంట్ కిల్లర్ గా తన పాత్రకు బోలెడు ప్రశంశలు దక్కాయి. ఇక అక్కడి నుంచి టబుకు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం పడలేదు.
× RELATED ఈ స్టార్ హీరోయిన్..సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిందా..!
×