పూరికి ఐస్మార్ట్ సవాల్

ఒకప్పుడు టాప్ రేంజ్ టాలీవుడ్ స్టార్స్ తనకోసం వేచి చూసేలా రేంజ్ మైంటైన్ చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్ ఇప్పుడు కొంత బ్యాడ్ టైం లో ఉన్న మాట వాస్తవం. తన స్థాయి హిట్ లేక అభిమానులు కూడా పూరి ఎప్పుడు కం బ్యాక్ అవుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ విడుదలైన ఐస్మార్ట్ శంకర్ పలు చర్చలకు దారి తీస్తోంది. అధిక శాతం పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తున్నా కామెంట్స్ చేస్తున్న వాళ్ళూ లేకపోలేదు.

ఇది దర్శకుడు ఎవరు అనే దానితో సంబంధం లేకుండా అన్ని సినిమాలకూ జరిగేదే. పూరి స్టైల్ హీరోయిజంతో పాటు రామ్ ని ఓ రేంజ్ మాస్ స్టైల్ లో ప్రెజెంట్ చేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. డూ ఆర్ డై తరహాలో దీని ఫలితాన్ని బట్టే ఇతర హీరోలతో పూరి ప్రాజెక్ట్స్ ఫైనల్ అవుతాయి. పూరి ఎప్పటిలాగే తన స్టైల్ ని కొనసాగించాడు. హీరో పాత్ర చిత్రీకరణలో  ఇడియట్ పోకిరిల నుంచి కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన పూరి ఐస్మార్ట్ శంకర్ లో అదే రూట్ లో వెళ్లినట్టు కనిపిస్తోంది.

సరిగ్గా చూపించాలే కాని రొటీన్ అయినా డిఫరెంట్ గా ఉన్నా మాస్ మసాలాలు సరైన రీతిలో కలిపితే ప్రేక్షకులు కథతో సంబంధం లేకుండా కనెక్ట్ అయిపోయి వసూళ్లు కురిపిస్తారు. పైసా వసూల్ కు పూరి ఈ ఫార్ములా సరిగా వాడలేదు. ఆశించిన ఫలితం దక్కలేదు. ఐస్మార్ట్ శంకర్ ఇది సరిగ్గా కుదిరితే మాస్ అండతో హిట్టు కొట్టేయోచ్చు. రామ్ అభిమానులు టీజర్ చూశాక అభిప్రాయపడింది ఇదే. తన స్టైల్ ని పక్కన పెట్టకపోయినా తనదైన టేకింగ్ తో శంకర్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే చాలు పూరి మళ్ళి ట్రాక్ లో పడ్డట్టే. ఈ ప్రశ్నకు సమాధానం రిలీజయ్యాకే దొరుకుతుంది.
× RELATED Big Twist to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ కొత్త పార్టీ పెట్టిన జేడీ?
×