చాలామందికి ప్రపోజ్ చేశా: శిరీష్

మెగా ఫ్యామిలీ హీరోలలో ఇంకా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో అల్లు శిరీష్. 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో ప్రేక్షకులను మెప్పించినా.. మెగా హీరోల రేంజ్ విజయం అందుకోలేకపోయాడు. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు  శిరీష్ ఎదురు చూస్తున్న విజయాన్ని అదించలేకపోయాయి. తాజాగా శిరీష్ తన 'ఏబీసిడీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమా 17 న రిలీజ్ అవుతోంది.  ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడడంతో జోరుగా ప్రమోషన్స్ చెస్తున్నారు 'ఏబీసిడీ' టీమ్.

తాజాగా ఐ5 ఛానల్ కు శిరీష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సరాదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ప్రశ్నలకు చకాచకా సమాధానాలు ఇచ్చాడు శిరీష్. ఆ ఇంటర్వ్యూ నుండి కొన్ని ప్రశ్నలు సమాధానాలు మీకోసం..

*ఇప్పటి వరకూ ఫ్యాన్స్ నుండి మీకు వచ్చిన ది బెస్ట్ కామెంట్

చూడ్డానికి కాలేజి స్టూడెంట్ లాగా ఉన్నావని చెప్పారు.  ఫ్యాన్స్ మీట్ జరినప్పుడు ఒక అబ్బాయి వచ్చి 'క్యూట్ గా ఉన్నావు'.. అంటూ నా బుగ్గ గిల్లాడు.  ఆ అబ్బాయి నాకంటే చిన్నవాడు.

*మీ ప్రెజెంట్ క్రష్ ఎవరు?

కెండాల్ జెన్నర్. లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఆ అమ్మాయి మీద క్రష్ ఉంది.

*అన్నయ్య నటించిన సినిమాల్లో మీరు ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది?

ఏదీ కాదు. 

*మీకు అలా అన్నయ్య సినిమాల్లో ఎదైనా సినిమా చేసే ఛాన్స్ వస్తే ఏ సినిమా చేస్తారు?

ఏదీ చేయను.

*శ్రీరస్తు శుభమస్తు .. కొత్త జంట సినిమాల్లో ఒకటి ఎంచుకోండి

శ్రీరస్తు శుభమస్తు.

*లవ్ ప్రపోజల్స్ ఎన్ని?

నాకు వచ్చినవా..నేను చేసినవా..

* మీకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ ఎన్ని?

నేను ప్రపోజ్ చేసినవి అయితే నాకు గుర్తుంటాయి.. నాకు ప్రపోజ్ చేసినవి అయితే ఓ ఐదారు!

*మరి మీరెంతమందికి ప్రపోజ్ చేశారు?

చాలామందికి(పెద్దగా నవ్వేస్తూ)

*టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్

బన్నీ.. తారక్.

*ఏ హీరోతో కలిసి యాక్ట్ చేయాలని మీకు డ్రీమ్ ఉంది?

సూర్య గారితో.. మెగాస్టార్ చిరంజీవి గారితో.

ఈ ర్యాపిడ్ ఫైర్ కాకుండా హీరోల పేర్లు చెప్పి వన్ వర్డ్ ఆన్సర్ లు చెప్పమని అడిగితే ఇలా చెప్పాడు.

చిరంజీవి గారు - గాడ్, పవన్ కళ్యాణ్ గారు - పీపుల్స్ పర్సన్, నాగబాబు గారు - స్వీట్ హార్ట్, రాం చరణ్ గారు - మై ఫేవరేట్ కజిన్.  అల్లు అర్జున్ గారు - హార్డ్ వర్కింగ్, వరుణ్ తేజ్ గారు - అల్ రౌండర్. 

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో "లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా" అనే డైలాగ్ స్టైల్ లో లాస్ట్ ప్రశ్నకు సమాధానం అదిరిపోయింది. ఆ ప్రశ్న సమాధానం పై ఒక లుక్కేయండి.

*కొత్తగా వచ్చే హీరోలకు మీరిచ్చే సూచన?

అలాంటివి ఏవైనా ఉంటే నాకు ఇవ్వండి.. తీసుకుంటాను!

    
    
    

× RELATED ప్రేమలోనే ఎన్ని గొడవలు పడ్డారో చెప్పేశాడు
×