విశాఖలో విగ్రహ రాజకీయం..

విశాఖపట్నం ఒడ్డున విగ్రహ రాజకీయం రంజుగా సాగుతోంది. విశాఖపట్నం కార్పొరేషన్ అధికారులు అనుమతి లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేశారని రాత్రికి రాత్రి సినీ ప్రముఖుల విగ్రహాలను తొలగించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే..

ఈ విషయం తెలిసి తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులంతా చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు వినికిడి.. తెలుగు సినిమాకు వన్నె తెచ్చిన కళాకారులను బాబు అవమానించాడని రగిలిపోతున్నారట...

అయితే చంద్రబాబు తీయించిన విగ్రహాలను పరిశీలిస్తే ఓ రాజకీయం కనపడుతోందని విశాఖ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. జీవీఎంసీ అధికారులు సోమవారం రాత్రి దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఫాల్కే అవార్డ్ గ్రహీత అక్కినేని నాగేశ్వరారావు టీడీపీ మాజీ ఎంపీ హరికృష్ణ విగ్రహాలను సైతం తొలగించారు.

అయితే విగ్రహాల తొలగింపు వెనుక టీడీపీ రాజకీయం ఉందనే స్థానికులు ఆరోపిస్తున్నారు..  దాసరి ఆది నుంచి కాంగ్రెస్ వాది అని.... ఇక నాగేశ్వరరావు కుటుంబం ఈ ఎన్నికల వేళ వైసీపీకి మద్దతు దారుగా మారిందని... నాగార్జున జగన్ ను కలిసి ఎన్నికల ముందర రాజకీయం నడిపారని చెబుతున్నారు.. ఇక సీఎం చంద్రబాబు బావమరిది హరికృష్ణ విగ్రహాన్ని కూడా జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. టీడీపీ అంటే చంద్రబాబే గుర్తుకురావాలని..  నందమూరి ఫ్యామిలీ వ్యక్తుల  బొమ్మలు కనపడవద్దు అనే పంతంతోనే బాబు హరికృష్ణ విగ్రహాన్ని కూడా   తీసివేయించారనే  విమర్శలు విశాఖ వాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు టీడీపీ వ్యతిరేకవాదులనే బాబు తీసివేయించాడని విశాఖలో జోరుగా చర్చసాగుతోంది.

 ఈ విగ్రహాల తొలగింపును ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం ఖండించింది. ఆందోళనకు దిగింది.  వీరి ముగ్గురు విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.  లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోంది.

అయితే కూల్చిన జీవీఎంసీ వాదన మరోలా ఉంది. విగ్రహాలను అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని.. విగ్రహాల ఏర్పాటు వల్ల స్థానికంగా ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందనే విగ్రహాలు తొలగించామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు విశాఖ లో విగ్రహ రాజకీయంగా రంజుగా రసవత్తంగా సాగుతోంది.
   

× RELATED విశాఖలో అమ్మకానికి 4 వేల ఎకరాలు సిద్ధం..నవరత్నాల అమలుకోసమేనా!
×