అలీబాబా ఓనర్ చెప్పిన 669 ఫార్ములా అర్థం ఇదేనట!

చైనా వ్యాపార దిగ్గజం.. ఆలీబాబా డాట్ కామ్ అధినేత జాక్ మా ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ప్రతిఒక్కరు తమ వ్యక్తిగత జీవితంలో చేయాల్సిన పని గురించి ఆయన మాట్లాడిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన ఉద్యోగుల్ని వీలైనంత ఎక్కువగా పని చేయాలని.. పనిలోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పటమే కాదు.. రోజుకు పన్నెండు గంటలు పని చేయాలంటూ చెప్పే ఆయన మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన శృంగారం గురించి సరికొత్తగా చెప్పారు. ఇటీవల తమ సంస్థ ఉద్యోగుల సామూహిక వివాహాల్లో పాల్గొన్న ఆయన సరికొత్త ఫార్ములాను వెల్లడించారు. పని విషయంలో 966 ఫార్ములాను చెప్పిన ఆయన.. తాజాగా శృంగారానికి సంబంధించి 669 ఫార్ములాను చెప్పుకొచ్చారు. ఉద్యోగుల పనికి సంబంధించి ఆయన చెప్పిన 996 ఫార్ములాకు అర్థమేమంటే.. వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పని చేయాలని చెప్పేవారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శల్ని ఆయన మూటగట్టుకున్నారు.

తాజాగా ఆయన చెప్పిన 669 ఫార్ములా విషయానికి వస్తే.. వారంలో ఆరు రోజుల పాటు (అంటే దాదాపుగా ప్రతిరోజూ) శృంగారం చేయాలని.. దాంతో చాలా లాభాలు ఉంటాయని చెబుతున్నారు. మరి.. రెండు ఆర్లు ఎందుకంటే.. ఆరు రోజులు ఆరుసార్లు అన్న దానికి రెండు ఆర్లను చెప్పిన జాక్ మా.. తొమ్మిది అంకె ఎందుకంటే.. చైనాలో తొమ్మిది అంకె.. ఎక్కువసేపు అన్న దానికి వినియోగిస్తారట. ప్రతి రోజు ఒక్కసారైనా తప్పనిసరిగా సెక్స్ చేయటంతో పాటు.. ఎక్కువసేవ చేయాలన్న అర్థం వచ్చేలా చెప్పారట. ప్రతిరోజూ శృంగారం చేయటం వల్ల బోలెడన్ని లాభాలు కలుగుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నట్లు చెప్పారట. ఫర్లేదు.. నిత్యం పని గురించి మాట్లాడే జాక్.. కొత్త పని గురించి భలే ఆసక్తిగా చెప్పారు కదూ!


× RELATED 'సాహో' ఫార్ములా సరికాదేమో డార్లింగ్?
×