‘పటాస్’ నుంచి ఆమె ఔట్

తెలుగు టీవీ రంగంలో ‘జబర్దస్త్’ తర్వాత అంత పాపులర్ అయిన కామెడీ షో.. పటాస్. యువతను ఆకట్టుకునే అడల్ట్ టచ్ ఉన్న జోకులతో నవ్వుల జల్లు పూయిస్తుంటుంది ఈ షో. ఇందులో ఆ జోకులు ఎలా అయితే జనాల దృష్టిని ఆకర్షిస్తాయో యాంకర్లు రవి-శ్రీముఖి జోడీ కూడా అంతగా ఆకట్టుకుంటూ ఉంటుంది. వాళ్లు ఈ షోలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మిగతా లేడీ యాంకర్లతో పోలిస్తే చాలా బోల్డ్ గా మాట్లాడుతూ బోల్డ్ యాక్ట్స్ చేసే శ్రీముఖి ‘పటాస్’ ద్వారా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె ఆ షోకే ఆకర్షణ అనడంలో సందేహం లేదు. ఆమె కెరీర్ కు కూడా ఈ షో బాగా ఉపయోగపడింది. అలాంటిది ఇప్పుడు ‘పటాస్’ నుంచి శ్రీముఖి తప్పుకుంటోందట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీముఖినే వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఒక వీడియో ద్వారా సందేశం ఇచ్చింది శ్రీముఖి.

మల్లెమాట ఎంటర్ టైన్ మెంట్స్  ప్రొడ్యూస్ చేసే ఈ షో నుంచి తాను కొంత కాలం విరామం తీసుకుంటున్నట్లు శ్రీముఖి వెల్లడించింది. ఇది ప్రొడక్షన్ హౌస్ అనుమతితోనే తీసుకున్న నిర్ణయమని ఆమె వెల్లడించింది. పటాస్ ఫ్యాన్స్ అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నానని.. తన కెరీర్ లో అతి ముఖ్యమైన ఇష్టమైన షో ‘పటాస్’ అని.. ఈ షోలో అవకాశం ఇచ్చినందుకు మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ వారికి థ్యాంక్స్ అని శ్రీముఖి పేర్కొంది. మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాదర్ రెడ్డి దీప్తి తననెంతగానో నమ్మి అవకాశం ఇచ్చారని.. ఈ షో షూటింగ్ ఎప్పుడు జరిగినా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండేదని.. ఈ షో కోసం స్టూడెంట్స్ రావడం వల్ల సెట్లో వాతావరణాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేసేదానన్ని శ్రీముఖి చెప్పిింది. ఐతే ‘పటాస్’ను పక్కన పెట్టి వేరే పనితో బిజీ కావాల్సినంత అవసరం శ్రీముఖికి ఏమొచ్చిందన్నది అర్థం కావడం లేదు. ఏదైనా తేడా వచ్చి ఆమెను షో నుంచి తప్పించారేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.

For Video Click Here
× RELATED ఫోటో స్టొరీ: ఝకాస్ పోజిచ్చిన పటాస్ బేబీ
×