హర హరా.. పెళ్లిరోజే పోయాడని!

'శంభో శంకర' సినిమాతో హీరో అయ్యాడు కమెడియన్ శంకర్. జబర్ధస్త్ కమెడియన్ గా అభిమానుల్ని సంపాదించుకున్న శంకర్ యాక్షన్ హీరోగా రూపాంతరం చెందడం పెద్ద షాకిచ్చింది. ఆ సినిమా వెంటే మరో రెండు మూడు సినిమాల్ని ప్రకటించేశాడు. డ్రైవర్ రాముడు.. కేడీ నంబర్ 1 అంటూ పోస్టర్లతోనే అదరగొట్టాడు. ప్రస్తుతం హీరోగా ఫిక్సయ్యి సినిమాలు చేస్తున్నాడు. శంభో శంకర మీడియా మీట్ లో తనకు అవకాశాలిస్తామని చెప్పి వెయిటింగ్ చేయించినందుకు.. పరిశ్రమ హీరోలు - అగ్ర నిర్మాతల్నే తూర్పారబట్టి గట్స్ చూపించాడు ఈ శ్రీకాకుళం చిన్నోడు. అతడి డేర్ కి ప్రశంసలు దక్కాయి.

అదంతా సరే.. ఇప్పుడే అతడి గురించి ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు? అంటే నేటి ఉదయం నుంచి షకలక శంకర్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం సాగడంతో అసలేమైందో అంటూ అభిమానులు కలతకు గురయ్యారు. ఆ నోటా ఈనోటా శంకర్ కి అది తెలిసిందే. ఓ షూటింగ్ స్పాట్ నుంచి గెటప్ శీనుతో కలిసి శంకర్ లైన్ లోకొచ్చాడు. తాను చనిపోయానని ప్రచారం చేసిన వారిపై తిట్ల దండకం అందుకున్నాడు. ``మీకేం రోగాలు రా.. ఎక్కడుంటార్రా మీరు .. ఏం పనీ పాటా ఉండదురా మీకు.. మంచి ఉద్యోగంలో చేరండి..`` అంటూ సదరు సోషల్ మీడియా ప్రచారకర్తల్ని తిట్టేశాడు. ఈరోజు శంకర్ పెళ్లి రోజు.. హార్ట్ ఎటాక్ తో చనిపోయాడంటూ ప్రచారం చేశారని గెటప్ శ్రీను తెలిపారు.

కారణం ఏదైనా.. ఆర్టిస్టులపై ఇలాంటి దుష్ప్రచారం నిత్యకృత్యంగా మారింది. వ్యూస్ కోసం న్యూస్! అన్న చందంగా మారడంతో అది కాస్తా ఆర్టిస్టుల కోపానికి కారణం అవుతోంది. సామాజిక మాధ్యమాల ముప్పు ఏ తీరుగా ఉందో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అప్పట్లో కమెడియన్ మహేష్ చనిపోయాడు.. అంటూ ప్రచారమైంది. అలాగే  హైపర్ ఆది యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని ప్రచారమైంది. బ్రహ్మీ అలియాస్ బ్రహ్మానందం గుండె చికిత్స కోసం ఆస్పత్రిలో చేరితే చనిపోయాడని యూట్యూబ్ చానెళ్ల ప్రచారం చేసేశాయి. ఇలా ఎందరికో జరుగుతోంది. వీళ్లంతా తిరిగి ఆ వార్తల్ని ఖండించి తమపై దుష్ప్రచారం చేసిన వారిపై తిట్ల దండకం అందుకున్నారు. ఇదే పరిస్థితి రీసెంటుగా హీరో కం కమెడియన్ సునీల్ కి ఎదురైంది. తాను చనిపోయానని ప్రచారం చేసినందుకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషన్ అయిన సునీల్.. అలా ప్రచారం చేసి 10లక్షల (1మిలియన్) వ్యూస్ తెచ్చుకున్నారని.. అందుకోసమే అలాంటి చెత్త పని చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకుందామనుకుంటే క్షమాపణ కోరి ఎస్కేప్ అయ్యాడని సునీల్ ఈ సందర్భంగా తెలిపారు.× RELATED దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్ ...ఆర్య సమాజ్ లో పెళ్లి .. అసలేం జరిగిందంటే !
×