తుపాకీ రివ్యూస్ చాలా బాగుంటాయి - హీరో నిఖిల్

ఒక సినిమా విజయంలో ప్రమోషన్స్ ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఈ జనరేషన్ హీరోలు మంచి కథలను ఎంపిక చేసుకోవడంపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో.. సినిమా ప్రమోషన్స్ పై కూడా అంతకంటే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.  ఇంట్రెస్టింగ్ స్క్రిప్టులు ఎంచుకుంటూ.. ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగిపోతున్న యువ హీరో నిఖిల్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. త్వరలో నిఖిల్ కొత్త సినిమా 'అర్జున్ సురవరం' రిలీజ్ కానుంది.  దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టాడు నిఖిల్.

తాజాగా ఐ5 నెట్ వర్క్ స్టూడియోకు వచ్చిన నిఖిల్ న్యూస్ రీడర్ అవతారమెత్తాడు. తుపాకి.కామ్ న్యూస్ హెడ్ లైన్స్ చదివాడు.. అందులో పంచ్ లకు హాయిగా నవ్వేశాడు. "హలో అండీ.. వెల్కమ్ టు తుపాకి న్యూస్.  నేను మీ నిఖిల్ ని.. ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం" అంటూ వార్తలు ప్రారంభించిన నిఖిల్ కు మొదటి హెడ్లైనే షాక్ ఇచ్చింది "దర్శకుడిగా మారుతున్న సూపర్ స్టార్..విలన్ గా హీరో నిఖిల్" అని చదివి ఒక్కసారి అవాక్కయ్యాడు.. చిన్న పాజ్ ఇచ్చి "ఎవరండీ ఇది రాసింది? విలన్ గా హీరో నిఖిల్ ఏంటి?" అని రియాక్ట్ అయ్యాడు.  కాస్త తమాయించుకొని నెక్స్ట్ న్యూస్ హెడ్ లైన్ చదివాడు.

"విజయ ఢంకా మోగిస్తున్న అర్జున్ సురవరం.. బద్దలయిన బాక్స్ ఆఫీస్".. ఈ హెడ్ లైన్ చదివే సమయంలో నిఖిల్ మొహం క్రికెట్ స్టేడియంలో డేట్ నైట్ మ్యాచ్ జరిగేటప్పుడు వెలిగే ఫ్లడ్ లైట్ లా వెలిగిపోయింది. ఒకరకమైన తన్మయత్వంతో కూడిన ఆనందంతో చిరునవ్వు నవ్వుతూ తక్కువ వాయిస్ లో "ఈ న్యూస్ నిజమైతే బాగుండు..థ్యాంక్ యూ సో మచ్" కాస్త సిగ్గు పడ్డాడు. ఇలాంటి హెడ్లైన్స్ మరో మూడు నాలుగు చదవగానే పూర్తిగా నవ్వుల్లో మునిగిపోయాడు.   ఫైనల్ గా "ఓ మై గాడ్.. ఇవి హెడ్లైన్స్ లా లేవు.. తుపాకీ బుల్లెట్స్ లా ఉన్నాయి" అంటూ.. అవి తన గుండెల్లో సూటిగా దిగిపోయాయి అన్నట్టుగా రెండు చేతులను తనవైపు చూపించాడు.

ఇదంతా ఫన్ కోసమే చేశారని ఫైనల్ గా కంక్లూజన్ ఇచ్చాడు.  కంక్లూజన్ అనగానే అయిపోయిందని అనుకుంటారేమో.. అయిపోలేదు.  ఇక ఈ ఎపిసోడ్ కు  క్లైమాక్స్ కూడా ఉంది. తుపాకి వెబ్ సైట్ గురించి మాట్లాడుతూ  నిఖిల్ "తుపాకి జెన్యూన్ అండ్ హానెస్ట్ న్యూస్ ఇస్తుంది. నేను ఫాలో అవుతూ ఉంటాను. రివ్యూస్ చదువుతూ ఉంటాను.  కొన్నిసార్లు నా సినిమాలను తిట్టారు(నవ్వుతూ).. అయినా పర్వాలేదు. అది క్రియేటివ్ క్రిటిసిజం" అన్నాడు.  తుపాకీ ఒక ఫెంటాస్టిక్ వెబ్ సైట్ అని.. నేను ఫాలో అవుతూ ఉంటాను అని తెలిపాడు.  ఇక మే 31 రిలీజ్ కానున్న 'అర్జున్ సురవరం' సినిమా గురించి చెప్తూ "ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ స్టొరీ.  ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది.  ఫ్యామిలీ అంతా కూర్చుని కలిసి చూడగలిగే చిత్రం. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం డార్క్ హ్యూమర్. సీరియస్ పాయింట్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే లో సిట్యుయేషనల్  కామెడీ చాలా ఉంటుంది" అన్నాడు.

'అర్జున్ సురవరం'లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న నిఖిల్ తుపాకి.కాం న్యూస్ చదివేందుకు నిజం జర్నలిస్టు లాగా న్యూస్ రీడర్ అవకాశం ఎత్తడం విచిత్రమే. ఇంకా ఆలస్యం ఎందుకు.. ఆ ఫన్నీ వీడియోను ఒకసారి చూసేయండి.

× RELATED పెళ్లి కోసం పోటిపడుతున్న యువహీరోలు | Nithin, Nikhil Marriages Trending in Tollywoood | i5 Network
×