సవతి తల్లి కొడుకు అయినా!

ముంబై ఫేజ్ -3 ప్రపంచంలో తైమూర్ అలీఖాన్ విలాసాలపై నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంటుంది. వేల కోట్ల పటౌడీ ఆస్థాన సంపదకు అతడు వారసుడు. సైఫ్- కరీనా జంట కుమారుడిగా అతడిపై బోలెడంత మీడియా ఫోకస్ ఉంది.  అతడు ఎగిరి గంతేసినా.. కోతి కమ్మచ్చి ఆడినా.. డాడ్ భుజాలు ఎక్కి .. మామ్ చంకనెక్కి కూచున్నా.. కవరేజీకేం డోఖా లేదు. వీళ్ల వెంట వైరల్ భయానీ లాంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడూ ఒకరుంటారు.

తైమూర్ బర్త్ డేకి కరీనా స్నేహితురాలు తనకు ఉన్న ఓ తోట(వనం)నే రాసిచ్చింది. సెలబ్రిటీ ప్రపంచం విలువైన కానుకల్ని అందించి బిగ్ షాక్ లు ఇచ్చిన సందర్భాలున్నాయి. తైమూర్ ఎక్కడికి వెళ్లినా అక్కడ మీడియా ఫోకస్ అన్ లిమిటెడ్ గా ఉంటోంది. నిరంతరం ఈ క్యూట్ కిడ్ చిలిపి చేష్టల ఫోటోలు సోషల్ మీడియాలో అంతే జోరుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక మామ్ - డాడ్ షూటింగుల బిజీలో ఉంటే తైమూర్ కి ఇంట్లో టైమ్ పాస్ ఎలా? అంటే ఇదిగో ఈ ఫోటోనే సమాధానం.

తనకో అన్న ఉన్నాడు. పేరు ఇబ్రహీం అలీఖాన్. సైఫ్ - అమృత జంటకు జన్మించినవాడు. యువకథానాయిక సారా అలీఖాన్ కి సోదరుడు. అతడు ఇదిగో ఇలా తైమూర్ ని ఆడిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ``కరీనా కుమారుడు తైమూర్ అలీఖాన్ తో సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ఫోటో ఎక్స్ క్లూజివ్`` అంటూ అంతర్జాలంలో అభిమానులు జోరుగా వైరల్ చేసేస్తున్నారు. ఈ ఫోటోలో ఇబ్రహీం అలీఖాన్ ని చూస్తే అచ్చం డాడ్ సైఫ్ కి డిట్టోగా కనిపిస్తున్నాడు. పరిశీలనగా చూడకపోతే సైఫ్ నే అనుకునే ప్రమాదం ఉంది. అంతగా అచ్చు గుద్దేశాడు. సవతి తల్లి కరీనా కుమారుడే అయినా తైమూర్ అంటే అన్నకు ఎంత ప్రేమనో ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. ఇక  నటవారసుల వెల్లువలో బాలీవుడ్ క్రేజీ యువహీరోగా ఇబ్రహీం తెరపైకి దూసుకు రావడానికి మరి కొంత సమయం పట్టొచ్చు. ప్రస్తుతానికి డెబ్యూ కన్ఫామ్ కాలేదు. ఇబ్రహీం విదేశాల్లో చదువుకున్న సంగతి తెలిసిందే.
    

× RELATED రెండేళ్ల తరువాత మరణించిన కొడుకు గుండెచప్పుడు విన్న తండ్రి
×