#సూర్య39 ప్రకటన.. డైరెక్టర్ ఇతనే!

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.  అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి.  తెలుగు ప్రేక్షకులకు కూడా సూర్య కొత్త సినిమాల అప్డేట్స్ ను చక్కగా ఫాలో అవుతుంటారు. అలా సూర్య సినిమాల అప్డేట్ లు ఫాలో అయ్యేవారికి ఇదో ఇంట్రెస్టింగ్ న్యూస్.  సూర్య కొత్త సినిమా ప్రకటన వచ్చిసింది.

#సూర్య39 సినిమాను కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. శివ ఈ సినిమాకు దర్శకుడు.  తెలుగులో 'శౌర్యం' సినిమాకు దర్శకత్వం వహించిన ఈ శివ తమిళంలో పెద్ద స్టార్ డైరెక్టర్.  స్టార్ హీరో అజిత్ తో వరసగా 'వీరమ్'.. 'వేదాళం'.. 'వివేగం'.. 'విశ్వాసం' అంటూ నాలుగు సినిమాలు చేశాడు.  దాదాపు అన్నీ హిట్లే. ఇప్పుడు శివ సూర్య ను డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ సినిమాను సూర్య కజిన్.. పాపులర్ కోలీవుడ్ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తాడు.

ఇదిలా ఉంటే సూర్య నటించిన 'NGK' మే 31 న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు సెల్వరాఘవన్.  ఈ సినిమా తర్వాత కేవీ ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు కాకుండా 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో మరో సినిమా 'సూరరై పొట్రు' లో కూడా నటిస్తున్నాడు సూర్య. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే శివ సినిమా షూటింగ్ మొదలుపెడతాడని సమాచారం.  అజిత్ కు వరసగా సూపర్ హిట్స్ అందించిన శివ ఇప్పుడు సూర్యతో ఎలాంటి సినిమా చేస్తాడో.. సూర్యను ఎలా ప్రెజెంట్ వేచి చూడాలి.


× RELATED సల్మాన్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ని కలుపుతారా?
×