ప్రస్తుతం శంకర్ కోలీవుడ్ లో ఇండియన్ 2 నుంచి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. కమల్ హసన్ శంకర్ కాంబినేషన్ లో 29 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిమీద భారీ అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో శంకర్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే తమిళ్ ఆడియన్స్ కి లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే.
ఇతర భాషల కంటే తమిళ్ నుంచి తెరకెక్కే సినిమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అయినా కూడా తమిళ్ లో ఈ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ కాకపోవడం విశేషం. అదే సమయంలో ఇండియన్ 2 నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోయిన కూడా కోలీవుడ్ ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం శంకర్ సినిమాలని భాషలతో సంబంధం లేకుండా అభిమానిస్తారు. గేమ్ చేంజర్ మీద ఏ స్థాయిలో అయితే తెలుగులో హైప్ ఉందో ఇండియన్ 2 మూవీ మీద కూడా అలాగే ఉంది. అలాగే సూర్య 42వ సినిమా మీద కూడా అదే హైప్ ఉంది. అదే సమయంలో లోకేష్ కనగరాజ్ విజయ్ కాంబోలో వస్తున్న లియో సినిమా మీద కూడా మంచి బజ్ ఉంది.
అయితే తమిళ్ హీరోలైన విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో చేసిన వారిసు మూవీ విషయంలో అంత క్యూరియాసిటీ చూపించలేదు. అలాగే ధనుష్ వెంకి అట్లూరి దర్శకత్వంలో చేసిన వాతి మూవీపైన కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం ఈ రెండు సినిమాలు టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో తెలుగు దర్శకులు తెరకెక్కించిన సినిమాలు కావడమే అనే మాట వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.