డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?

Tap to expand
పాన్ ఇండియాలో టాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాలు పాన్ ఇండియాలో తెలుగు సినిమా సత్త చాటాయి. గ్లోబల్ స్థాయిలోనూ తెలుగు సినిమా ఖ్యాతికెక్కింది. భవిష్యత్ లో ఇలాంటి వండర్స్  చాలా సహజం కాబోతున్నాయి. ఇండియన్ సినిమా అంటే? వరల్డ్ సినిమాకి తెలుగు సినిమానే గుర్తొచ్చేలా?  టాలీవుడ్ ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

రాజమౌళి...ప్రశాంత్ నీల్..శంకర్ లాంటి దిగ్గజాలు తెలుగు సినిమా స్థాయిని పెంచే సరికొత్త ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే కదా కోలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ లో లాంచ్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది హీరోల ఎంట్రీ ఖరారైంది. ఆ సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇంకా సౌత్ నుంచి వివిధ భాషల పరిశ్రమ హీరోలు..నటులు సైతం తెలుగువైపు చూస్తున్నారు.


అవకాశం ఇవ్వాలనేగానీ ఎగిరి  గంతేసి నటించడానికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ నటులు సైతం టాలీవుడ్ వైపు చూస్తోన్న తరుణమిది. తెలుగు సినిమా స్థాయి పెరగడంతోనే ఇది సాద్యమైంది. ఇక నిర్మాణ పరంగా టాలీవుడ్ లో ఎన్నో బడా నిర్మాణ సంస్థలున్నాయి. వందలకోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఎంతో మంది నిర్మాతలున్నారు.

ఆర్ధికంగా టాలీవుడ్ ఎంతో వృద్దిలో ఉంది. కోవిడ్ వచ్చినా తట్టుకుని నిలబడిదంటే?  టాలీవుడ్ నిర్మాణ పరంగా ఎంత బలంగా ఉందన్నది అద్ధం పడుతుంది. చిన్న పాటి నిర్మాణ సంస్థలు సైతం బడ్జెట్ విషయంలో ఏనాడు రాజీ పడింది లేదు. క్వాలిటీ కోసం ఎక్కడా రాజీ పడరు. బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడం కోసం డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేయడం అన్నది  టాలీవుడ్ కే చెల్లింది.

బాలీవుడ్ సైతం చేయని  సాహసోపేతమైన నిర్ణయాలతో టాలీవుడ్ ముందుకెళ్తుంది. బడ్జెట్ పరంగా టాలీవుడ్ అంతకంతకు పెచుకుంటూ వెళ్తుందే తప్ప తగ్గిన సందర్భాలు లేవు.  ఈవిషయంలో బాలీవుడ ని సైతం టాలీవుడ్  నెట్టేసిందని చెప్పొచ్చు. హిందీ నటులు తెలుగు వైపు తొంగి చూసినప్పుడు సన్నివేశం ఎలా ఉందన్నది  అద్దం పట్టింది.

కోలీవుడ్ లో బడ్జెట్ పరమైన మార్పులు ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్నాయి. గతంలో 'ఐ'..'రోబో'...'2.0' లాంటి శంకర్ చిత్రాలు భారీ బడ్జెట్  తో  తెరకెక్కించినా లాభల పరంగా 'రోబో' తప్ప తక్కిన రెండు చిత్రాలు నష్టాలే తెచ్చిపెట్టాయి. ఇలాంటి కారణాలే 'భారతీయుడు -2' విషయంలో లైకా సంస్థని వెనక్కి లాగిపెట్టాయి. ఆ కారణంగానే సినిమా నిర్మాణం మధ్యలోనే బ్రేక్ పడింది.

కొన్ని రకాల కోర్టు ఇబ్బందులు..ఆర్ధిక సమస్యలు అధిగమించి ఎట్టకేలకు మళ్లీ ఆ సినిమా షూట్ పున ప్రారంభమైంది అనుకోండి. కానీ టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి ఉండదు. ఆ నిర్మాత కాకపోతే మరో నిర్మాత భాగస్వామిని వెంటనే రెడీ అవుతారు. మద్యలో సినిమా నిర్మాణం అపడం అన్నది టాలీవుడ్ లో పెద్దగా కనిపించదు.

నష్టమో..లాభమో సినిమా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఓ విధిగా  భావిస్తారు. ఈ రకమైన యాటిట్యూడ్ మిగతా పరిశ్రమల నుంచి టాలీవుడ్ ని వేరు పరుస్తుందని చెప్పొచ్చు. అలా కాకపోతే 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి విజువల్ వండర్స్ పురుడు పోసుకునేవే కాదు. 2025 లో రాజమౌళి మరో విజువల్ ట్రీట్ తో ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు అన్నది రాసిపెట్టుకోవాల్సిన విషయమే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More