'పోకిరి' లానే 'జల్సా' 4కే వెర్షన్ రెడీ

Tap to expand
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా 'పోకిరి' చిత్రాన్ని 4 కే వెర్షన్ లో రీమాస్టరింగ్ చేసి రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 150 షోలు వేస్తే ప్రతిదీ హౌస్ ఫుల్స్ తో ఆడాయని అభిమానులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఇదే తీరుగా బ్లాక్ బస్టర్ మూవీ 'జల్సా'ని 4 కే వెర్షన్ లో రీమాస్టరింగ్ చేసిన వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. అయితే దీనిపై ఇటీవల కొంత గందరగోళం నెలకొనగా.. ఇప్పటికి క్లారిటీ వచ్చేసింది. జల్సా 4 కే వెర్షన్  రెడీ అయ్యింది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా రీరిలాజ్ కానుంది.


అయితే ఎన్ని థియేటర్లలో విడుదలవుతుంది? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పవన్ బర్త్ డే కి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రాజుకుంటోంది. జల్సా థియేటర్ల ముందు బోలెడంత హంగామా నెలకొంటుందనడంలో సందేహం లేదు.

పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏంటి?గత నెలలో పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆయన షూటింగ్ షెడ్యూల్స్ గురించి సరైన సమాచారం లేదు. పవన్ ఇప్పుడు జ్వరం నుండి కోలుకున్నాడు. కానీ అతను ఇంకా సినిమా షూటింగ్ లకు రాలేదని సమాచారం.

పవన్ ఈ నెల మొదట్లో 'వినోదయ సీతమ్ రీమేక్' ని ప్రారంభించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. పవన్ ఇంకా షూట్ మోడ్ లోకి రాలేదు.  ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఎప్పుడు షూటింగ్ చేస్తారనే దానిపై కూడా క్లారిటీ లేదు.

పవన్ వినోదయ సీతమ్ రీమేక్ను ప్రారంభిస్తారా లేదా హరి హర వీర మల్లు పెండింగ్ షూట్ ని మళ్లీ ప్రారంభిస్తారా? అనేది స్పష్టంగా తెలియదు. తదుపరి రెండు వారాల్లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
Show comments
More