కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?

Tap to expand
`ఆఫత్` అంటూ అనన్య పాండేతో ఒక రేంజులో రొమాన్స్ చేశాడు లైగర్ దేవరకొండ. యువ జోడీ ఘాటైన మూవ్స్ తో ఒక రేంజులో కిక్కిచ్చారు. లైగర్ విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ బాలీవుడ్ ప్యాట్రన్ లో ప్రమోషన్ ఊపందుకుంది.

తాజాగా మరో సింగిల్ ఈ సినిమా నుంచి విడుదలైంది. కోకా 2.0 పేరుతో విడుదలైన ఈ పాట ఆద్యంతం యువతరాన్ని మెప్పించే అంశాలతో స్పెషల్ గా సాగింది.


ముఖ్యంగా విజయ్ దేవరకొండ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా ఎనర్జిటిక్ గా ఈ పాటలో కనిపించాడు. అతడు పూర్తిగా పంజాబీ సింగ్ లుక్ లోకి మారిన వైనం ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే వీడీ మరో దలేర్ మెహందీలా.. హనీ సింగులా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించాడు. అతడు పూర్తిగా తలపాగా పంజాబీ ట్రెడిషన్ డ్రెస్ లతో కొత్తగా మేకోవర్ అయ్యాడు. అతడికి జతగా అనన్య పాండే అంతే ఎనర్జీతో స్టెప్పులు కలిపింది. ఈ జంట ఈడు జోడు ఎంతో ముచ్చటేస్తోందని చెప్పాలి.

డబుల్ ట్రిపుల్ ఎనర్జీ... రెట్టింపు స్వాగ్ .. హీట్ పెంచే బీట్ తో ఆకట్టుకుంది. విజయ్ - అనన్యల మధ్య సింక్ అంతే చక్కగా కుదిరింది. ఈ క్రేజీ సాంగ్ తో అన్ని చోట్లా లైగర్ వేడుకలు రెట్టింపయ్యాయి. లిజో జార్జ్-డిజె చేతస్ ఈ డ్యాన్స్ నంబర్ కి కొరియోగ్రాఫ్ చేసారు. ఇక ఈ పాటకు గాయని గీతా మాధురి గాత్రం మరింత హస్క్ ని పెంచిందని చెప్పాలి.

ఈ ఫాస్ట్-బీట్ నంబర్ తో గాయకుడు రామ్ మిరియాల తనదైన మార్క్ చూపించాడు. ఈ స్పెషల్ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్- కరణ్ జోహార్ - అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో మూవీ విడుదల కానుంది. రమ్యకృష్ణ- మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Show comments
More