సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్

Tap to expand
కిడ్స్ ని ఆకర్షిస్తే కుటుంబ సమేతంగా అందరినీ థియేటర్లకు రప్పించే వీలుంటుంది. హాలీవుడ్ లో సూపర్ హీరో ఫ్రాంఛైజీ `థోర్` ఈ కేటగిరీలో పెద్ద సక్సెసైంది. థోర్ కి నేటితరం కిడ్స్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.

ఇక థోర్ కి ఉన్నట్టే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి కూడా కిడ్స్ లో కొంత ఫాలోయింగ్ ఉంది. అతడి మ్యాన్ లీ నెస్ .. మంచితనం అన్ని జనరేషన్ల వారికి నచ్చుతుంది. అందుకేనేమో.. ఇప్పుడు థోర్ కి అతడు యాథృచ్ఛికంగా ప్రమోషన్ చేస్తున్నాడు.


నా ఫేవరెట్ సూపర్ హీరో థోర్ రెడీగా ఉన్నాడు. థోర్ లవ్ అండ్ థండర్  గురువారం నుంచి థియేటర్లలోకి వస్తోంది! అంటూ సోషల్ మీడియాల్లో సాయి ధరమ్ ఈ మూవీ కళాకృతుల వీడియోని షేర్ చేసారు. థోర్ ఫీడ్ ఇదిగో అంటూ అతడు ఆ వీడియోని ప్రదర్శించాడు. ఇక ఇందులో థోర్ -కళాకృతులు అరుదైన పాత్రధారుల బొమ్మలు ఎంతో ఎగ్జయిట్ మెంట్ ని పెంచేవిగా కనిపిస్తున్నాయి.

వీడియో చివరిలో సాయిధరమ్ `థోర్` తరహాలోనే ఆయుధాన్ని చేపట్టి భయపెట్టాడు కూడా. థోర్ కి సాయి తేజ్ తనదైన శైలిలో ప్రచారం చేయడం కలిసి రానుంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాయనుందని చర్చ సాగుతోంది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం మావయ్య పవన్ కల్యాణ్ తో కలిసి ఓ తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బైక్ ప్రమాదంలో గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడు తదుపరి సినిమాల్లో ఘనమైన రీఎంట్రీ కోసం వేచి చూస్తున్నాడు. పవన్ మావయ్య తో కలిసి నటించే అవకాశం అతడికి దక్కడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకుముందే విక్రమ్ మూవీ సక్సెస్ పార్టీ (చిరు ఏర్పాటు చేసినది)లో కనిపించిన సాయి ధరమ్ తేజ్ ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నల కోసం 10 లక్షల నిధిని అందజేసిన సంగతి తెలిసిందే.


For Video : https://youtube.com/shorts/lCcVG47wPyc?feature=share
Show comments
More