లండన్ వీధుల్లో యంగ్ హీరో... హీరోయిన్ సయ్యాట!

Tap to expand
యంగ్ హీరో నాగశౌర్య నిత్యం విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి`. నటుడు శ్రీనివాస్ అవసరాల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాసరి ప్రొడక్షన్స్ సంస్థలపై టి.జి. విశ్వప్రసాద్ దాసరి పద్మజ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లండన్ లో జరుగుతోంది.

అక్కడి సుందర ప్రదేశాల్లో ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్య మాళవిక నాయర్ ల కలయికలో `కల్యాణ వైభోగమే` వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గంతంలో నాగశౌర్య - శ్రీనివాస్ అవసరాల కలయికలో సూపర్ హిట్ ఫిల్మ్ `ఊహలు గుస గుసలాడే` మూవీ తెరకెక్కింది.


ఇలా రెండు సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ల కలయికలో రూపొందుతున్న సినిమా ఇది. హిట్ కాంబినేషన్ లో సినిమా అంటే సహజంగానే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి వుంటుంది.

ఇక రెండు సక్సెస్ ఫుల్ కలయికల నేపథ్యంలో వస్తున్న సినిమా అంటే ఆ అంచనాలు వేరుగా వుంటాయి. ఈ మూవీపై కూడా అలాంటి అంచనాలే వున్నాయి. సన్నితమైన భావోద్వేగాలని అంతే అందంగా తెరకెక్కించడంతో నటుడు డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ది ప్రత్యేక శైలి.

తాజా చిత్రాన్ని కూడా సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కిస్తున్నారట. లండన్ లో జరుగుతున్న చిత్రీకరణలో హీరో నాగచైతన్యతో పాటు హీరోయిన్ మాళవిక నాయర్ ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. పలు కీలక సన్నివేశాలను అక్కడ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. కీలక నటీనటులు టాలెంటెడ్ టెక్నీషియన్స్ ల కలయికలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఆనందంగా వుందని చిత్ర నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్ దాసరి పద్మజ తెలిపారు.
Show comments
More