'ది వారియర్' ఆల్రెడీ సగం సక్సెస్ కొట్టేసింది: బోయపాటి

Tap to expand

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో బోయపాటి ఒకరు. మాస్ యాక్షన్ సినిమాలకి ఆయన కేరాఫ్ అడ్రెస్ లా కనిపిస్తారు. 'అఖండ' సినిమాతో కొత్త రికార్డులను సెట్ చేసిన బోయపాటి ఆ తరువాత సినిమాను రామ్ తో చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ కెరియర్లో ఇది ఫస్టు పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే రామ్ తాజా చిత్రమైన 'ది వారియర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా బోయపాటి వచ్చారు.


ఈ వేదికపై బోయపాటి మాట్లాడుతూ .. "అనంతపురంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అనంతపురం తో పాటు ఈ సీమ అంటే నాకు సొంత ఇల్లు అనే ఫీలింగ్. ఎందుకంటే మీరు చూపించే అభిమానం అలాంటిది .. మీతో నాకు ఉన్న అనుబంధం అలాంటిది. నేను ఏ సినిమా చేసినా .. బోయపాటి చేశాడని ఈ సీమ ప్రజలు అనుకోరు .. మా కుటుంబ సభ్యుడే డైరెక్షన్  చేశాడు అనుకుంటారు. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు గనుకనే అనంతపురం అంటే నాకు ఎంతో ఇష్టం.


అప్పట్లో నందమూరి తారకరామారావు గారి నుంచి బాలకృష్ణ గారి వరకూ మీ దగ్గర  ఉండటానికే .. మీలో ఉండటానికే ప్రయత్నించారు. ఈ సినిమా ఫంక్షన్ ఇక్కడ పెట్టినట్టుగా చెప్పగానే ఇక్కడే సగం సక్సెస్ కొట్టేసిందని చెప్పాను. ఇక మిగిలింది ఓన్లీ థియేటర్లో ఉండి చూడటమే. ఏదైనా షాప్ పెట్టుకుంటే ఒక మంచి మనిషిని పిలిచి రిబ్బన్ కట్ చేయిస్తాం. ఈ సినిమా ఫంక్షన్ ను ఇక్కడికి వచ్చి చేస్తున్నామంటే మీరంతా అంత మంచి మనుషులని అర్థం. అక్కడే 'ది వారియర్' ఫుల్ సక్సెస్ కొట్టేసింది. మీ ఆశీర్వాదం ఈ సినిమా టీమ్ కి ఉండాలి.. మీ అభిమానము ఎప్పుడూ ఇలాగే ఉండాలి" అంటూ చెప్పుకొచ్చారు.

Show comments
More