సంక్రాంతి ఫైట్ డిక్లేర్ అయినట్టేనా?

Tap to expand
2022 సంక్రాంతి ఫైట్ భారీ స్థాయిలో వుంటుందని పాన్ ఇండియా మూవీస్ తో పాటు క్రేజీ సినిమాల  మధ్య రసవత్తర పోటీ వుంటుందని అంతా భావించారు. ఫ్యాన్స్ ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతి బిగ్ ఫైట్ వుంటుందని ఆశగా ఎదురుచూశారు. కానీ వారి ఆశలన్నింటిపై కరోనా వైరస్ థర్డ్ వేవ్ భారీ దెబ్బ కొట్టింది.  దీంతో 2022 సంక్రాంతి ఫైట్ నీరు గారిపోయింది. భారీ సినిమాలేవీ పోటీలో లేకుండా రిలీజ్ లని వాయదా వేసుకున్నాయి. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న 'ట్రిపుల్ ఆర్' కోవిడ్ ఆంక్షల దెబ్బతో వెనక్కి వెళ్లిపోయింది. ఇక జనవరి 12న రావాలని ప్లాన్ చేసుకున్న 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ ని అర్థాంతరంగా మార్చేసింది.

ఇక ఈ రెండు చిత్రాలు పోటీపడుతుంటే పవన్ కల్యాణ్ 'భీమ్లానాయక్' మధ్యలో ఎందుకని దిల్ రాజు రిలీజ్ ని వాయిదా వేయించాడు. ఆ తరువాత చాలా సినిమాలు పోటీపడటం ఇష్టం లేక కోవిడ్ ఆంక్షల్ని తట్టుకోలేక వాయిదా పడ్డాయి. భారీ ఆశలు పెట్టుకున్న సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నాయి. దీంతో రసవత్తర పోటీని చూడాలని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ప్రేక్షకులకు 2022 సంక్రాంతి తీవ్ర నిరాశనే మిగిల్చింది. దీంతో అందరి దృష్ణ 2023 సంక్రాంతి పై పడింది.  


వచ్చే సంక్రాంతికి ఏ ఏ సినిమాలు పోటీపడబోతున్నాయి? .. ఈ సారైనా సరవత్తర పోటీ వుంటుందా? అని అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. 2023 సంక్రాంతికి మరో ఏడు నెలలు గడువు వుండటంతో ఏ స్టార్ ఏ సినిమాతో పోటీకి రెడీ అంటూ సవాల్ విసురుతున్నాడు? .. ఏ క్రేజీ హీరో పాన్ ఇండియా మూవీతో బాక్సాఫీస్ ని దడదడలాడించడానికి రానున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి మొత్తం ఆరు క్రేజీ చిత్రాలు పోటీకి కాలుదువ్వుతున్నట్టుగా తెలుస్తోంది.
 
2023 సంక్రాంతి టార్గెట్ గా క్రేజీ హీరోలకు సంబంధించిన ఆరు ప్రెస్టేజియస్ మూవీస్ బరిలోకి దిగబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు సినిమాలు రిలీజ్ డేట్ లు ప్రకటించేశాయి కూడా. దిల్ రాజు బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ ల కలయికలో రానున్న మూవీని సంక్రాంతి బరిలో దించేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే నిర్మాత వంశీ పైడిపల్లి - విజయ్ ల కలయికలో చేస్తున్న సినిమాని కూడా సంక్రాంతికే రెడీ చేస్తున్నారట.

ఈ సంక్రాంతి మిస్సవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు 2023 సంక్రాంతికి ఖచ్చితంగా బరిలోకి దిగాల్సిందే అని ఫిక్సయ్యాడట. 'సర్కారు వారి పాట' తరువాత మహేష్ .. త్రివిక్రమ్ లో ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని జూలైలో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే బాటలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో పవన్ 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు.

ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీని సంక్రాంతిని రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ప్రభాస్ 'ఆది పురుష్' 2023 సంక్రాంతి బెర్త్ ని ఫైనల్ చేసేసుకుని డేట్ కూడా ఇచ్చేసింది. మెగాస్టార్ 'భోళా శంకర్' కూడా సంక్రాంతి రేస్ కి సై అంటూ సైరన్ కొట్టేస్తున్నాయి. ఈంతో వచ్చే సంక్రాంతి రేస్ రసవత్తరంగా వుంటడం ఖాయం అని తెలుస్తోంది.
Show comments
More