బాలీవుడ్ హీరోకు కోబ్రా భయం

Tap to expand
తమిళం ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో విక్రమ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో అంతకు మించి అనేలా క్యారెక్టర్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.

అయితే అతను ఎంత కొత్తగా ట్రై చేసినా కూడా గతంలో మాదిరిగా అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. ముఖ్యంగా తెలుగులో  అయితే అతని మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది. తెలుగులో అపరిచితుడు సినిమా తర్వాత ఏ సినిమా తో కూడా పెద్దగా కలెక్షన్స్ కూడా అందుకోలేకపోయాడు.


అయినప్పటికీ విక్రమ్ పై ఓ వర్గం ఆడియన్స్ అయితే మంచి నమ్మకం అయితే ఉంది. అతనికి సరైన కథ తగిలితే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే అని చెప్పవచ్చు. ఆ మధ్య కాలంలో తన కొడుకు తో తీసిన మాహాన్ సినిమా పరవాలేదు అనిపించింది. కానీ పూర్తిస్థాయిలో అయితే కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ కోబ్రా సినిమా పైనే పడింది. ఈ సినిమాలో కూడా విక్రమ్ విభిన్నమైన క్యారెక్టర్స్ తో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

తనలోని 20 రకాల షేడ్స్ ను ఈ సినిమాలో విక్రమ్ సరికొత్తగా హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. అయితే విక్రమ్ కోబ్రా సినిమాకు కూడా బాలీవుడ్ లో కొంత ఆందోళనలు నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగచైతన్య మరొక ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ట్లు సమాచారం.

అయితే ఈ సినిమాకు విక్రమ్ కోబ్రా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వీలైనంత వరకు అమీర్ ఖాన్  పోటీ లేకుండానే సౌత్ లో తన సినిమా విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ కోబ్రా కాటు నుంచి మాత్రం అతను అంత ఈజీగా తప్పించుకునేలా లేడని అనిపిస్తోంది. అంతేకాకుండా సమంత యశోద సినిమా తో పాటు నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా మరుసటి రోజు విడుదల కానున్నాయి. ఇక ఏజెంట్ సినిమా వస్తుందో రాదో ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా కూడా విక్రమ్ సినిమాకు కూడా బాలీవుడ్ బడా హీరో కాస్త భయ పడుతున్నట్లు తెలుస్తోంది.
Show comments
More