కవల సోదరులు.. అన్న భార్యతో తమ్ముడు!

Tap to expand
ఒక సినిమాలో అన్నదమ్ములు ఇద్దరు ఒకేలా ఉంటారు.. వారిలో ఒకరిని ప్రేమించిన హీరోయిన్ తానే... అనుకొని తన తమ్ముడితో స్నేహంగా ఉంటుంది.. ఆ తరువాత అసలు విషయం తెలిసి బాధపడుతుంది... అయితే ఈ అవకాశాన్ని వాడుకున్న ఆ తమ్ముడిపై తరువాత చర్యలు ఉంటాయనుకో.. ఇలాంటి సంఘటనే ఇప్పుడు నిజజీవితంలోనూ జరిగింది. కవలల్లో ఒకరిని ఓ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత తన భర్తే అనుకొని తన తమ్ముడితో చనువుగా ఉంది. కానీ ఈ విషయం తన తమ్ముడు చెప్పకుండా అన్న భార్యతో కలిసుండడం మొదలుపెట్టాడు.. అసలు  విషయం ఏంటంటే తన భార్యతో తమ్ముడు కలిసుంటున్నాడన్న విషయం  తెలిసినా పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?

ఓ వైపు సామాజికంగా.. సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తరుణంలో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. మంచి చెడు అని ఏదీ ఆలోచించకుండా కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు.


వావి వరుసలు మార్చి లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొన్ని విషయాల్లో తప్పని తెలిసినా అప్పటి ఆనందం కోసం అఘాయిత్యాలకు పాల్పడతున్నారు. ఇలాంటి వారిపై సమాజం ఎన్ని చర్యలు తీసుకున్నా..  వారి బుద్ధి మారడం లేదు. తాజాగా జరిగిన సంఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. అభం శుభం తెలియని అమాయకురాలిని మోసం చేసిన అన్నదమ్ములపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కవలలుగా పుట్టడం అదృష్టంగా భావిస్తారు. ఒకే రూపం కలిగిన వారు తమ ఇంట్లోకి జన్మించడం వల్ల సాక్షాత్తూ ఆ లవకుశలే వచ్చారన్నట్లు భావిస్తారు. కానీ ఇలా జన్మించిన వారిలో కొందరు కనీసం లవకుశ వారంత మంచివారు కాకపోయినా అవకాశాన్ని వాడుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఇద్దరు ఒకేలా ఉన్న వ్యక్తులు ఒకే అమ్మాయిపై ఒకరు తెలియకుండా మరొకరు అత్యాచారం చేస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఆ మహిళ కాస్త ధైర్యం చేసి ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో దుండగులపై చర్యలు తీసుకున్నారు.

మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన కవల సోదరుల్లో ఒకరు పెళ్లి చేసుకున్నారు. కవల్లలో ఒకరిని పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయి కూడా చాలా సంతోషించింది. ఆ ఇంట్లో అడుగుపెట్టడం అదృష్టంగా భావించింది. సోదరుని భార్య తల్లితో సమానం అంటారు. కానీ ఈ కవలల్లో తమ్ముడు అన్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడడం ప్రారంభించారు. అయితే ఆయన తన భర్తే అనుకొని అతని తమ్ముడితో చనువుగా ఉండేది. కొన్ని రోజుల తరువాత అసలు విషయం తెలిసింది. దీంతో ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. కానీ ఆ భర్త తమ్ముడిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి వెనకేసుకొచ్చాడు.

తన భార్యను తమ్ముడు లోబర్చుకున్నా.. లైట్ గా తీసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఒకేలా ఉన్న తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు ఆ కవల సోదరులను అరెస్టు చేశారు. కవలలుగా పుట్టిన వీరు ఇలా ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడడంపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Show comments
More