పీసీకి ఏమైంది? రక్తమోడిన ముఖం!

Tap to expand
ప్రియాంక చోప్రా  తలకి భారీ గాయం..ముఖమంతా కర్తం ధారలా కారుతుంది. ఒక కన్ను పూర్తిగా లొట్టపోయింది. కను రెప్ప తెరిచి చూడలేని పరిస్థితి. మరోవైపు బయటకు వచ్చేసిన నాలుక..దాని క్రిందుగా అయింట్ మెంట్. నెట్టింట వైరల్  గా మారిన ఈ  ఫోటోచూస్తే గ్లోబల్ స్టార్ కి ఏమైందని కంగరు పడటం ఖాయం. పీసీని ఆసుపత్రికి తీసుకెళ్లలేదా? అని విచారించడం అంతే సహజం.

కానీ ఇదంతా మేకప్ అన్న సంగతి తెలిస్తే మాత్రం పీసీపై కోపం నశాళానికి పాకడం ఖాయం. అంతేగా...అంతేగా అని అంటున్నారు కొందరు నెటి జనులు.  ప్రియాంక చోప్రా కొన్ని గంటల క్రితం ఇన్ స్టా స్టోరీస్ లో ఈ ఫోటో పోస్ట్ చేసింది.


దీంతో అభిమానులంతా కంగారు పడ్డారు. పీసీకి ఏమైంది? ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందంటూ ఆందోళన చెందారు.  కానీ ఆ తర్వాత కాసేపటికి అర్ధమవుతుంది అదంతా బొమ్మ యాక్టింగ్ అని. మైకప్ సెటప్ అని.  అవును ఇదంతా మేకప్...అంతా సెటప్ మరి.

ప్రియాంక చోప్రా నటిస్తోన్న 'సిటాడెల్'  సెట్స్ నుండి లీకైన కొన్ని ఫోటోల్నే పీసీ పోస్ట చేసింది. మోస్ట్ అవైటెడ్ అమెరికన్ సిరీస్ 'సిటాడెల్' సెట్ నుండి తాజా ఫోటోగ్రాఫ్ ని విడుదల చేయగా అది ఇలా కనిపించింది. దీంతో నెటి జనులు పీసీపై అంతెత్తున లేచిపడుతున్నారు. ప్రియాంక చోప్రా మరీ ఓవర్ చేస్తుందని..ఈ కిడ్ వేషాలు ఏంటని  కామెంట్లు పెడుతున్నారు.

మరికొంత మంది నిజంగా సిటాడెల్  సెట్స్ నుంచి వచ్చిన ఫోటోలేనా?  లేక కేన్స్ ఆహ్వానం రాక ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోలేక వేషాలు వేస్తుందా? అంటూ  సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కేన్స్ ఉత్సవాల్లో తమన్నా...పూజాహెగ్డే మెరుపులు మెరిపిస్తున్నారు.

రోజుకొక డిజైనర్ దుస్తుల్లో కేన్స్ కే వన్నె తీసుకొస్సున్నారు.  కానీ ఇంత వరకూ పీసీ జాడ ఎక్కడా కేన్స్ లో కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఇన్ని సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా పీసీ ఆ గుట్టు విప్పుతుందేమో చూడాలి.
Show comments
More