నిద్ర పట్టడం లేదా పుష్ప?

Tap to expand
అల్లు అర్జున్ పుష్ప సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన పుష్ప సినిమా కు వస్తున్న ప్రశంసలకు సమాధానం ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే పలువరు ప్రముఖులు సినిమా స్టార్స్.. క్రికెట్ స్టార్స్ పుష్ప సినిమా పై ప్రశంసలు కురిపించారు. సెలబ్రెటీలు ఎవరు పుష్ప సినిమా గురించి స్పందించినా వెంటనే తను రిప్లై ఇస్తున్నాడు. తన నటన నచ్చినందుకు.. పుష్ప సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉందని.. మీ ప్రశంసలకు కృతజ్ఞతలు అంటూ బన్నీ ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇస్తున్నాడు. సాదారణంగా అయితే స్టార్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్కువగా వారే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అతి తక్కువ మంది మాత్రమే ఇతరులకు ఆ బాధ్యత అప్పగిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ వంటి స్టార్ స్వయంగా తానే ట్వీట్స్ చేయడం లేదా పోస్ట్ లు చేయడం వంటివి చేస్తూ ఉంటాడు.

పుష్ప కు వస్తున్న ప్రతి ఒక్క ప్రశంసకు కూడా అల్లు అర్జున్ స్వయంగా స్పందిస్తున్నాడట. తాజాగా అక్కినేని హీరో సుమంత్ ట్విట్టర్ ద్వారా పుష్ప పై ప్రశంసలు కురిపించాడు. ఇన్ని రోజులు కుదరలేదు.. ఇప్పుడు సినిమా చూశాను బాగుంది నీ నటన కూడా బాగుంది అంటూ అల్లు అర్జున్ ను మెన్షన్ చేశాడు. సుమంత్ రాత్రి 11 గంటల సమయంలో ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ నుండి ఆ ట్వీట్ కు అర్థరాత్రి రెండు గంటల సమయంలో సమాధానం వచ్చింది. సరిగ్గా అర్థరాత్రి 2 గంటల 21 నిమిషాలకు అల్లు అర్జున్.. థ్యాంక్యూ బ్రదర్ మీకు నా నటన నచ్చినందుకు సంతోషంగా ఉందంటూ రీ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ ఆ టైమ్ లో ట్వీట్ చేయడం తో అంతా కూడా ఆశ్చర్య పోతున్నారు.


ఈ మద్య కాలంలో ఎప్పుడు పడితే అప్పుడు ట్వీట్స్ చేస్తున్నావు.. పుష్ప ఇచ్చిన సక్సెస్ తో నిద్ర పట్టడం లేదా పుష్ప అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా అర్థ రాత్రి వరకు ఏం చేస్తున్నావు పుష్ప అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప సినిమా తో గత కొన్ని వారాలుగా ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ఆయన సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ముఖ్యంగా శ్రీవల్లి స్టెప్పు తో అల్లు అర్జున్ పుష్ప సినిమా వైరల్ అవుతూనే ఉంది. శ్రీవల్లి చెప్పు వీడి వేసిన స్టెప్పు మాత్రమే కాకుండా తగ్గేదే లే డైలాగ్ మరియు మ్యానరిజం కూడా చాలా ఫేమస్ అయ్యాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ లో కూడా ఈ డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. లెజెండ్ ల నుండి మొదలుకుని సోషల్ మీడియా సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పుష్ప.. పుష్ప రాజ్.. నీ అవ్వ తగ్గేదే లే అంటూ వివిధ భాషల్లో సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతున్నారు.
Show comments
More