సూపర్ స్టార్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయమట

Tap to expand
తమిళంలో ఒకప్పుడు రజినీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను మించి ప్రస్తుతం సూపర్ స్టార్  విజయ్ కి ఉంది అనడంలో సందేహం లేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ గా పాన్ ఇండియా లో రజినీకాంత్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. వరుసగా వందల కోట్ల సినిమా లను చేస్తున్న విజయ్ ఈ ఏడాది ఆరంభంలో మాస్టర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా యావరేజ్ టాక్ దక్కించుకుంది... కరోనా పరిస్థితులు ఉన్నా కూడా వంద కోట్లకు మించి వసూళ్లు సాధించింది. దాంతో సూపర్ స్టార్ రేంజ్ ఏంటో తేలిపోయింది. విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

విజయ్ ను ఆయన అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా నెల్సన్ దిలీప్ చూపించేందుకు సిద్దం అవుతున్నాడట. ముఖ్యంగా మాస్ అభిమానులు మరియు విజయ్ యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారి కోసం ఈ సినిమా లో భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు ఐటెం సాంగ్ ఇంకా చెప్పుకుంటూ పోతే అభిమానులు ఇప్పటి నుండే పిచ్చెక్కి పోయేలా నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాను చేస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సినిమా పక్కా కమర్షియల్ మూవీగా ఉంటుందని అంటున్నారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రెడీ చేసిన స్క్రిప్ట్ విజయ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ను అందించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా లో విజయ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ కాస్త కుదుట పడ్డ వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే ఈ ఫుల్ మీల్స్ మూవీ విడుదల అవ్వాల్సి ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
Show comments
More