బాలయ్య అభిమానులను ఊరిస్తున్న పుకారు

Tap to expand
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల జాబితాలో ఎక్కువగా ఫ్యాక్షన్ సినిమాలు ఉంటాయి. నరసింహా నాయుడు.. సమర సింహా రెడ్డి మరియు చెన్నకేశవరెడ్డి మంచి విజయాలను దక్కించుకున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా పలు సినిమాలు కూడా బాలయ్య కెరీర్ లో ఉన్నాయి. ఫ్యాక్షన్ సీన్స్ లో బాలయ్య నటన అద్బుతం అంటూ అభిమానులతో పాటు అందరు కూడా బాలయ్యను అభినందించడం జరిగింది. ఈమద్య కాలంలో బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలను పక్కన పెట్టాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఫ్యాక్షన్ కథతో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అది కూడా రియల్ ఫ్యాక్షన్ గొడవలను వెండి తెరపై చూపించబోతున్నారట.

ప్రస్తుతం 'అఖండ' సినిమా ను బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. అఖండ సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసింది. సినిమా ను ఈ నెలలో విడుదల చేయాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇదే సమయంలో బాలకృష్ణ కొత్త సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క దాదాపుగా పూర్తి అయ్యిందంటూ సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 1980 ల్లో రాయలసీమలో జరిగిన ఫ్యాక్షన్ గొడవలు ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఒక స్క్రిప్ట్ ను గోపీచంద్ రెడీ చేశాడట. బాలయ్య ను చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా గోపీచంద్ చూపించబోతున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ మలినేని ఈ సినిమా లో బాలయ్య ను రెండు విభిన్నమైన వేరియేషన్స్ లో బాలయ్యను చూపిస్తాడని అంటున్నారు. ఈ పుకారు ప్రస్తుతం బాలయ్య అభిమానుల్లో ఆశలు కలిగిస్తుంది. బాలయ్య అభిమానులను ఊరిస్తున్న గోపీచంద్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Show comments
More