నాని సినిమా పై ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఏమైందంటే??

Tap to expand
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' పూర్తి కావచ్చింది. అయితే మరో సినిమా 'అంటే సుందరానికి' అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఫుల్ లెన్త్ కామెడీ మూవీగా రూపొందనున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదివరకు చెప్పినట్లుగానే వివేక్ మంచి ఫన్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు టైటిల్ పోస్టర్ తో చెప్పేసాడు. అయితే ఈ మూవీ ఇప్పుడు ఎవరి నిర్మాణంలో తెరకెక్కుతుంది అనే చర్చ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిచూపులు మెంటల్ మదిలో సినిమాల నిర్మాత రాజ్ కందుకూరి.. 'అంటే సుందరానికి' సినిమా పై ఫిర్యాదు చేసాడు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు తన ప్రొడక్షన్ హౌస్‌తో ముందస్తు ఒప్పందం ఉన్నందున ఈ చిత్రాన్ని తన బ్యానర్ లో తీయాలనీ రాజ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాడు.

అయితే వివరాల్లోకి వెళితే.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయను మెంటల్ మదిలో సినిమా ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్‌గా లాంచ్ చేశాడు నిర్మాత రాజ్ కందుకూరి. ఆ సినిమా తర్వాత ధర్మపాత క్రియేషన్స్ నిర్మాణంలోనే మరో సినిమా వెంటనే చేయాలనీ వివేక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడట. అయితే వివేక్ తన రెండవ సినిమా బ్రోచేవారెవరురాను మరోమ్ ప్రొడక్షన్స్ పై విజయ్ కుమార్ మన్యం నిర్మించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ మిస్ అయిందని వివేక్ మూడవ సినిమా తన నిర్మాణంలో చేయాలనీ రాజ్ కందుకూరి మాట్లాడుకున్నాడు. అందుకు వివేక్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. బ్రోచెవరేవరురా విజయంతో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. మైత్రి మూవీ మేకర్స్‌తో సహా పెద్ద బ్యానర్ల ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌తో 'అంటే సుందరానికి' అనే సినిమా ప్రారంభించాడు. ఇక రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మించే ముందు మైత్రి వారు తన సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ అంశం పై చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కూడా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. చూడాలి మరి అంటే సుందరానికి నిర్మాత ఎవరో తేలాల్సి ఉంది.
Show comments