బిబి అన్ సీన్ : అఖిల్.. మోనాల్.. సోహెల్ పెళ్లి ముచ్చట్లు

Tap to expand
బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్ సివంగి అయ్యింది. తనను వీక్ అన్నందుకు అవినాష్ ను ఓ రేంజ్ లో ఆట ఆడేసుకుంది. నీ కంటే నేను స్ట్రాంగ్ ఆ విషయాన్ని ప్రేక్షకులు ఓట్లు వేసి నిరూపించారు కదా. ఎందుకు నా కంటే నువ్వు స్ట్రాంగ్ అని అనుకుంటున్నావు అంటూ మోనాల్ వేసిన ప్రశ్నకు అవినాష్ షాక్ అయ్యాడు. ఇక అఖిల్ తనను నామినేట్ చేసిన సమయంలో ఆ తర్వాత తాను అఖిల్ ను నామినేట్ చేసిన సమయంలో రచ్చ రచ్చ గా గొడవ జరిగింది. అఖిల్ తో చాలా పెద్ద చర్చ జరిగి ఇక ఇద్దరు మాట్లాడుకోరేమో అన్న రీతితో పరిస్థితి మారిపోయింది. అయితే అంతకు కొన్ని గంటల ముందు అఖిల్ మరియు మోనాల్ ల మద్య ఆసక్తికర చర్చ జరిగింది.

అన్ సీన్ లో దాన్ని చూపించారు. ఉదయం పాట తర్వాత అఖిల్.. మోనాల్ మరియు సోహెల్ లు ఎండలో కూర్చున్నారు. ఆ సమయంలో వారి మద్య పెళ్లి టాపిక్ వచ్చింది. అఖిల్ మాట్టాడుతూ నేను ఖచ్చితంగా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను  అన్నాడు. నేను ప్రేమించిన అమ్మాయికి మా అమ్మ ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అమ్మ ఓకే చెప్పే వరకు వెయిట్ చేస్తానంటూ  అఖిల్ అన్నాడు. అప్పుడు మోనాల్ స్పందిస్తూ నువ్వు ఖచ్చితంగా మీ అమ్మ గారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు.. ప్రేమ వివాహం చేసుకోవు అంటూ ఛాలెంజ్ చేసింది.

ఇక్కడ నుండి బయకు వెళ్లిన వెంటనే నవ్వు పెళ్లి చేసుకుంటావేమో అంటూ సోహెల్ ను మోనాల్ అడిగింది. అయితే మరో అయిదు సంవత్సరాల వరకు నేను ఇలాగే ఉంటాను అంటూ సోహెల్ అన్నాడు. పెళ్లి చేసుకునే విషయంలో తన కుటుంబంకు ప్రాముఖ్యత ఇస్తాను అంటూ సోహెల్ పేర్కొన్నాడు. అలా ముగ్గురి మద్య పెళ్లి విషయం చాలా సేపు చర్చ జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటలకే నామినేషన్ పక్రియ రావడంతో హాట్ హాట్ గా మారిపోయింది. నామినేషన్ పక్రియ సుదీర్ఘంగా సాగడం వల్ల పెళ్లి ముచ్చట్లు మెయిన్ ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేయలేదు కావచ్చు.
Show comments