మజ్లిస్ పార్టీ మొత్తం 51 డివిజన్లలో పోటీచేస్తోంది. ఇందులో 50 స్థానాలు గెలవాలన్నది ఎంఐఎం టార్గెట్ . ఇక అన్ని కూడా ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానాలనే ఎంఐఎం టార్గెట్ గా పెట్టుకుంది.
పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో కంటే భిన్నంగా ప్రచారం చేసిన ఎంఐఎం.. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న ముద్రను ఎక్కడా కూడా రాకుండా చూసుకుంది.
అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న ముద్రను ఎక్కడా రాకుండా చూసుకుంది. టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు లేదని ప్రజలకు చెప్పుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నేతల నుంచి టీఆర్ఎస్ వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించడం విశేషం.