కిడ్నాపర్ కోసం రైలునే ఆపలేదు!

Tap to expand
సినీ ఫక్కీలో జరిగిన ఓ కిడ్నాప్ ఉదంతం చివరకు సుఖాంతం అయ్యింది. మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రైల్లో పారిపోయిన కిడ్నాపర్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ సినిమా క్లైమాక్స్ ను తలపించేలా పోలీసులు వ్యవహరించిన తీరుకు అందరూ ప్రశంసలు కురిపించారు.

తాజాగా మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగుడిని పట్టుకోవడానికి పోలీసులు సాహసమే చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి రైలు ఎక్కడంతో ఆ రైలును అధికారులు వేటాడారు.

 మధ్యప్రదేశ్ లోని లలిత్ పూర్ స్టేషన్ లో బాలిక కిడ్నాప్ కు గురైందని తెలియడంతో రైల్వే అధికారులు సీసీటీవీలను పరిశీలించారు. కిడ్నాపర్ భోపాల్ వైపు వెళ్తున్న రప్తిసాగర్ రైలులో వెళ్లినట్లు తెలిసింది. దీంతో రైలును ఎక్కడా ఆపకుండా 200 కి.మీలపైగా ప్రయాణింప చేశారు.

ఆ రైలును లలిత్ పూర్ నుంచి భోపాల్ వరకు ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లారు. భోపాల్ లో పోలీసులు భారీగా ఇరువైపులా మోహరించి కిడ్నాపర్ ను పట్టుకొని బాలికను సురక్షితంగా కాపాడారు. ఈ ఛేజింగ్ ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసింది.

కాగా స్టేషన్లలో ఆగకుండా రైలు పోవడంతో ప్రయాణికులు కాస్త భయపడుతూ గందరగోళానికి గురయ్యారు. చివరకు కిడ్నాపర్ ను పట్టుకోవడానికి అలా చేశారని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Show comments