ఫేస్ బుక్ తాజా నిర్ణయం..వచ్చే జులై వరకు వర్క్ ఫ్రం హోం!

Tap to expand
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు సంబంధించి ఒక్కొక్క అంశం మీద క్లారిటీ వస్తోంది. మొన్నటివరకు ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని.. వచ్చే ఏడాది మార్చి నాటికి అంతో ఇంతో సాధారణ పరిస్థితులు నెలకొనటం ఖాయమన్న మాట వినిపించింది. అయితే.. అలాంటి పరిస్థితి లేదన్న విషయం గడిచిన వారం రోజులుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే.. కరోనా పీడ ప్రపంచానికి వచ్చే ఏడాది మధ్య వరకు కూడా పోయేటట్లు లేదన్న విషయంపై స్పష్టత వచ్చేస్తోంది.

ఈ నేపథ్యంలో.. కొన్ని కంపెనీలు ముందుగా మేల్కొంటున్నాయి. తమ ఉద్యోగులకుభవిష్యత్తు పట్ల ఒక క్లారిటీ ఇచ్చేలా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు సాధారణం కావటానికి తక్కువలో తక్కువ పది నెలలు కంటే ఎక్కువ సమయమే పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరేలా ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఇప్పటివకే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయటానికి అవకాశాన్ని కల్పించాయి. గూగుల్.. ట్విట్టర్ లాంటి సంస్థలు అయితే.. దీర్ఘ కాలం ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుందన్న సంకేతాల్ని ఇప్పటికే ఇచ్చేశారు. తాజాగా ఫేస్ బుక్ సైతం ఈ తరహా నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది జులై వరకు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని తాజాగా స్పష్టం చేసింది.

అదే సమయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తానన్న సంకేతాన్ని ఇచ్చింది. గూగుల్ మాదిరే ఫేస్ బుక్ సైతం తమ ఉద్యోగుల ఆఫీసు అవసరాల కోసం వెయ్యి డాలర్లు ఇచ్చేందుకు సిద్దమైంది. ఇప్పటికిప్పుడు ఇంటిని.. ఆఫీసుగా మార్చుకోవటం కష్టమైనందున.. అందుకుఅవసరమైన ఖర్చును తామే పెట్టుకుంటామని చెబుతూ.. వెయ్యి డాలర్లను అందజేస్తుంది.

ప్రపంచంలోని కరోనా కేసుల నమోదు.. ప్రభుత్వ  ఆదేశాల నేపథ్యంలో వచ్చే ఏడాది జులై వరకు ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఎక్కువ కాలం ఇంటి నుంచి పని చేయటం ఉద్యోగుల సామర్థ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Show comments