తమిళ అమ్మాయి పాత్రలో మెరవనున్న శర్వానంద్ హీరోయిన్!!

Tap to expand
'రన్ రాజా రన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. అదే సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీలో 'జిద్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న అమ్మడి వయ్యారాలను టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు డైరెక్టర్ సుజిత్. మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేసిన ఈ ముంబై భామ.. వరుస అవకాశాలతో దూసుకుపోయింది. మొదటి సినిమా తర్వాత టైగర్ కొలంబస్ లాంటి సినిమాలు చేసింది సీరత్. కానీ సినిమాలు మంచి పేరును తెచ్చుకున్నా అమ్మడికి మాత్రం పాపులారిటీ రాలేదు. ఇక ఆ తర్వాత మన్మధుడు నాగార్జునతో 'రాజుగారిగది 2'.. అల్లుశిరీష్ నటించిన 'ఒక్కక్షణం' సినిమాలతో పాటు మాస్ రాజా రవితేజ సరసన 'టచ్ చేసి చూడు' సినిమాలో నటించింది. ఇక అమ్మడు ఫస్ట్ సినిమా నుండి అందాల ఆరబోతలో ఎక్కడ కూడా తగ్గలేదు.

తను నటించిన ప్రతీ సినిమాలో మినిమం అందాల గ్యారంటీ. కానీ ఈ భామ కెరీర్లో ఆమె అందాలు ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. అందుకే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు నెట్టింట సెగలు రేగుతున్నాయి. అమ్మడి అందాల ఫోటోలు చూస్తే కుర్రాళ్ల గుండెలు లయ తప్పుతున్నాయి. తాజాగా 'కృష్ణ అండ్ హిస్ లీల' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమ్మడి క్యారెక్టర్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం 'మా వింత గాథ వినుమా' అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ కొత్త సినిమా తన కెరీర్ మారుస్తుందని ఆశిస్తుంది. తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను తమిళ అమ్మాయి పాత్రలో నటించనుందట. అమ్మడు ఈ సినిమా పై మంచి ఆశలే పెట్టుకుంది. మరి ఈ సినిమా అయినా సీరత్ కెరీర్లో జోష్ నింపుతుందేమో చూడాలి!
Show comments