ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దేవరకొండ హీరో!

Tap to expand
యువ హీరో విజయ్ దేవరకొండకు కెరీర్ లో అతి తక్కువ సినిమాలతోనే క్రేజ్ వచ్చింది. మొదట్లో సూపర్ హిట్లతో దూసుకుపోయి యూత్ ఐకాన్ గా మారిన విజయ్ ఈమధ్య మాత్రం వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన 'డియర్ కామ్రేడ్' డిజాస్టర్ గా నిలవగా... ఈమధ్య రిలీజ్ అయిన 'వరల్డ్ ఫేమస్ లవర్' డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ మరో సినిమా 'హీరో' గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై తెరకెక్కించే 'హీరో' అనే ద్విభాషా చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకు నిర్మాతలు. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అయ్యేలా ఉండడంతో హోల్డ్ లో పెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మైత్రీ వారినుంచి బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సీరీస్ వారు టేకప్ చేశారట. 'హీరో' ను పాన్ - ఇండియా సినిమాగా నిర్మిస్తారని సమాచారం. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే 'హీరో' షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారట.

పూరి-విజయ్ సినిమా 'లైగర్' కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. ఆగిపోయిందని అనుకున్నప్పటికీ ఈ 'హీరో' పాన్ ఇండియా సినిమాగా పట్టాలెక్కే అవకాశం ఉండడం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈమధ్య ప్యాన్ ఇండియా సినిమాలు పెద్దగా విజయం సాధించడం లేదు. మరి విజయ్ ఈ పాన్ ఇండియా సినిమాలతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో వేచి చూడాలి.
Show comments