ప్రభుత్వాసుపత్రులు రూపురేఖలు మారుస్తానన్న సీఎం జగన్ !

Tap to expand
కర్నూలులో మూడో దశ 'వైఎస్ఆర్ కంటివెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ..కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు ఆ పై వయసున్న 5688420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ వార్డుల్లోనే వైఎస్సార్ కంటి వెలుగు పథకం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.

ఈ క్రమంలోనే అయన మాట్లాడుతూ ...అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే అని చెప్పే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని తానేనని జగన్ అన్నారు. మార్చి 1 నుంచి అవ్వాతాతలకు అవసరమైతే గ్రామ సచివాలయాల్లోనే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికోసం 133 కేంద్రాల్లో కంటి శస్త్ర చికిత్సకై ఏర్పాట్లు చేశామన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అవ్వాతాతలకు కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.

అలాగే రూ. 15337 కోట్లతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని ‘‘మొదటి దశలో రూ. 1129 కోట్లతో నాడు-నేడు. రెండో దశలో పీహెచ్సీ కమ్యూనిటీ సెంటర్లలో నాడు-నేడు. రూ. 700 కోట్లతో ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ. రాష్ట్రంలో కేవలం 11 బోధనాసుపత్రులు మాత్రమే ఉన్నాయి. మరో 16 టీచింగ్ ఆస్పత్రులు తీసుకువస్తాం. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
Show comments