ప్రధాని భద్రత కు గంటకు 7 లక్షలు!

Tap to expand
భారత ప్రధాని నరేంద్ర మోడీకి కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీవీఐపీ కేటగిరీలో ప్రధానికి అడుగడుగునా అత్యంత సుశిక్షితులైన భద్రతా సిబ్బంది కవచంలా ఉంటారు. అందులోనూ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ...పాక్ ముష్కరులను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న భారత ప్రధానిని ఎస్పీజీ భద్రతా సిబ్బంది కంటికి రెప్పలా కాపలా కాస్తుంటారు. దేశంలో కేవలం ప్రధానికి మాత్రమే పరిమితమైన ఎస్పీజీ భద్రతకు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో భారీగా నిధులు కూడా కేటాయించింది. మన దేశ ప్రధాని భద్రత కోసం ప్రతి రోజు రూ. 1.62 కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.


మన దేశంలోని వీవీఐపీ పొలిటిషియన్లు వీఐపీ పొలిటిషియన్లు ఎంపీలలకు వారి వారి ప్రాధాన్యతను బట్టి భద్రతను కేటాయిస్తారు. ప్రధాని మాత్రమే ఎస్పీజీ భద్రత కల్పిస్తారు. మిగతా నేతలకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి ఎటువంటి భద్రత కల్పిస్తున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లోక్సభలో ప్రశ్న అడిగారు. భారత్లో ఎస్పీజీ భద్రత పొందుతున్న ఏకైక వ్యక్తి ప్రధాని అని కిషన్ రెడ్డి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివిధ రాష్ట్రాల్లోని 56 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. 3000 మంది ప్రత్యేక కమాండోలున్న `ఎస్పీజీ`కి గత బడ్జెట్లో  రూ.592.55 కోట్లు కేటాయించారు. ప్రధాని భద్రతకు గంటకు రూ.6.75 లక్షల చొప్పున రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన సంగతి తెలిసిందే.
Show comments