'వెళ్లి ఏదైనా పని చూసుకోండ్రా.. ' విజయ్ సేతుపతి ఫైర్!

Tap to expand
మామూలుగా అయితే సినీ తారల ఇళ్లపై ఐటీ రైడ్స్ పెద్ద బ్రహ్మపదార్థం ఏమీ కాదు. ఇది వరకూ బోలెడంత మంది సినీ తారల ఇళ్ల మీద ఐటీ వాళ్లు పడ్డారు. కొన్నేళ్ల కిందట తమిళనటుడు విక్రమ్ ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగాయి. అప్పట్లో విక్రమ్ సౌత్ లో ఒక ఊపు మీద ఉండేవాడు. భారీ బడ్జెట్ సినిమాల్లో చేస్తున్న దశలో అతడి ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ విషయంపై స్పందిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు విక్రమ్. ఐటీ రైడ్స్ జరిగేంత స్థాయిలో తను సంపాదించడం హ్యాపీ అన్నట్టుగా అతడు ఇచ్చిన రియాక్షన్ అప్పట్లో ఆకట్టుకుంది కూడా!

అయితే ఇప్పుడు విజయ్ ఇంటి మీద ఐటీ రైడ్స్ పై చాలా రాజకీయం సాగుతూ ఉంది. ఇదంతా విజయ్ భవిష్యత్ పొలిటికల్ డ్రీమ్స్ ను దెబ్బతీయడానికి బీజేపీ వాళ్లు చేయించిన పని అని ఒక ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఇందులో అంత సీన్ లేకపోవచ్చు. కానీ తమిళనాడు బీజేపీ మాత్రం విజయ్ మీద అతిగా స్పందిస్తూ.. ఇదంతా తమ పని అని చెప్పుకోవడానికి తపిస్తోంది!

ఇక ఇదే సమయంలో.. ఈ అంశంపై రకరకాల విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి. అసలే తమిళనాడులో మీడియా హడావుడి చాలా ఎక్కువ. దీంతో విశ్లేషణలు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో విజయ్ పై ఐటీ రైడ్స్ వెనుక క్రిస్టియన్ కన్ వర్షన్ వ్యవహారం ఉందని ఒకరెవరో చెప్పుకొచ్చారు. క్రిస్టియన్ కన్వర్షన్స్ చేసే వాళ్లు విజయ్ సినిమాలకు ఫండింగ్ చేశారని  అందుకే ఐటీ రైడ్స్ అని మరో ప్రచారాన్ని మొదలు పెట్టారు. అసలే ఇది సోషల్ మీడియా యుగం ఎవడికి తోచిన విశ్లేషణలు వాడు చేసుకోవచ్చాయె!

అంతే కాదట.. ఇప్పటికే కొంతమంది తమిళ సినీ ప్రముఖులు క్రిస్టియానిటీ తీసుకున్నారని వారిలో విజయ్ సేతుపతి కూడా ఒకరని ఆ పోస్టింగ్ లో పేర్కొన్నారు. ఈ అంశంపై సేతుపతి స్పందించాడు. సింగిల్ లైన్లో విజయ్ సేతుపతి రియాక్ట్ అయ్యాడు. 'పొండ్రా.. వేరే ఏదైనా పని ఉంటే చేసుకోండ్రా..' అంటూ విజయ్ సేతుపతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. బహుశా ఇది చాలేమో!
Show comments