22 ఏళ్లలో ఢిల్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టిన మహిళలు 31 మందేనా!

Tap to expand
మహిళలు ప్రస్తుతం దేనిలో మేము తక్కువ కాదు అంటూ అన్ని రంగాలలోను తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంటూ ముదుకుసాగుతున్నారు. ముఖ్యంగా రాజకీయాలలో కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ లో మగవారితో పాటుగా ఆడవారు కూడా సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో  మాత్రం ఆడవారికి అంతగా ప్రాధాన్యత లభించడం లేదు అని తెలుస్తోంది.

ఢిల్లీ అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా 1993 లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి  22 సంవత్సరాల్లో 20 మంది కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలయ్యారు. అలా మొత్తంగా ఇప్పటివరకు కేవలం 31 మంది మహిళా ఎమ్మెల్యే లు మాత్రమే ఢిల్లీ అసెంబ్లీ లో అడుగుపెట్ట గలిగారు. 1993 లో తొలి అసెంబ్లీలోను - 1998 నాటి రెండో శాసన సభలోను బీజేపీ నుంచి ప్రతిసారీ ఒక్క మహిళా ఎమ్మెల్యే మాత్రమే ఎన్నికవుతూ వచ్చారు. ఆ తరువాత మరే ఇతర పార్టీ నుంచి ఒక్క మహిళ కూడా ఈ శాసన సభకు ఎన్నిక కాలేదు. 1993 లో ముగ్గురు మహిళలు ఎన్నిక కాగా-వారిలో ఇద్దరు కాంగ్రెస్ నుంచి - మరొకరు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు.

ఇకపోతే 1998 లో షీలా దీక్షిత్ మొదటిసారి ఢిల్లీ సీఎం అయ్యారు. అప్పుడే ఢిల్లీ అసెంబ్లీకి ఎక్కువమంది ఒకేసారి ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికలలో అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన తొమ్మిది మంది మహిళల్లో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా - బీజేపీకి చెందిన సుష్మ స్వరాజ్ హౌస్ ఖాస్ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. 1998లో అసెంబ్లీ ఎన్నికల ముందు సుష్మ కొద్దికాలం సీఎంగా వ్యవహరించారు. 2003 లో ఏడుగురు - 2008లో ముగ్గురు - 2013 లోనూ ముగ్గురు మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.   2015 లో ఆరుగురు ఎమ్మెల్యేలు గా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 79 మంది మహిళలు పోటీ చేసారు. వీరిలో 24 మంది కాంగ్రెస్ - బీజేపీ - ఆప్ పార్టీలకు చెందినవారు. చూడాలి మరి ఈసారి ఎంతమంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెడతారో...
Show comments