ఒక దేశాన్ని పాలిస్తున్న ఓ ఇండియన్ కుమారుడు!

Tap to expand
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాని అందరూ చూసే ఉంటారు.ఆ సినిమాలో  మహేశ్ బాబు తన పూర్వీకుల మూలలను వెతుకుతూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తమ మూలాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.. వారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అనే అంశాలను తెలుసుకోడానికి అతని ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ సినిమాని తెరకెక్కించగా సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సినిమా మాత్రం మంచి జ్ణాపకంగా మిగిలిపోయింది.

ఇకపోతే ప్రస్తుతం ఉండే బిజీ లైఫ్లో తమ పనులు మానేసుకుని తమ పూర్వికులు నివశించిన సొంతూరు మూలాలను వెతుక్కుంటూ వెళ్లే వారు చాలా తక్కువమంది ఉన్నారు. కానీ ఓ దేశ ప్రధాని తన సొంతూరు చూడటానికి అత్యంత సాదాసీదాగా ఇండియాకువచ్చారు అంటే నమ్మడానికి కొంచెం కష్టం అయినా కూడా నమ్మితీరాల్సిందే.  అలా తన సొంతూరు ని వెతుకుంటూ వచ్చింది ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్. లియో వరద్కర్ తండ్రి అశోక్ వరద్కర్ - మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లా మాల్వన్ తాలూకా వరద్గావ్ లో నివశించేవారు. ఆ ప్రాంతంలో ఆయనకు వైద్యుడిగా మంచి పేరుంది. 1960 సమయంలో అశోక్ ఇండియా నుంచి ఐర్లాండ్ కి వలసవెళ్లారు.

ఆ తరువాత అక్కడి మహిళనే  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ జంట కుమారుడే ప్రస్తుత ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్. ఈ క్రమంలో ఇండియాకు ఫ్యామిలీతో కలిసి వచ్చిన లియో వరద్కర్ తన సొంతూరుకు వెళ్లారు. అక్కడ గ్రామస్థుల బాగోగులు తెలుసుకున్నారు. స్థానికంగా నివశించే శ్రీ దేవ్ వెబోటా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వారి బంధువైన మాల్వానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు.   ఐర్లాండ్లోని ఫైన్ గేల్ అనే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు లియో. 2017 జూన్లో ప్రధానిగా గెలుపొందారు.
Show comments