లవ్.. సెక్స్ పై హాట్ కామెంట్స్

Tap to expand
సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది. అనుకోని అదృష్టంగా బాలీవుడ్ లో ఈమెకు ఆఫర్లు వచ్చాయి.. అలాగే సక్సెస్ లు కూడా దక్కాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ. ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె చేసే బోల్డ్ ఇంటర్వ్యూలకు మంచి క్రేజ్ ఉంది.

ఇటీవల మరోసారి తాప్సి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియా టుడే కాంక్లేవ్ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంలో తాప్సి కొన్ని షాకింగ్ ప్రశ్నలు ఎదుర్కొంది. ఆ బోల్డ్ ప్రశ్నలకు తనదైన శైలిలో విభిన్నంగా సమాధానాలు చెప్పింది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కిడ్స్ గురించి తాప్సి స్పందిస్తూ తల్లిదండ్రుల సపోర్ట్ లేకుంటే వారు ఈ స్థాయిలో ఉండేవారే కాదు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

మీరు సెక్స్ సరిగా చేయకపోయినా బాగా ప్రేమించే వ్యక్తిని ఇష్టపడతారా.. లేదంటే మిమ్ములను ఇష్టపడకున్నా సెక్స్ బాగా చేస్తే మీరు ఇష్టపడతారా అంటూ ప్రశ్నించగా తాప్సి సెక్స్.. ప్రేమ ఎప్పుడు వేరు వేరుగా ఉండవని చెప్పుకొచ్చింది. ఇక తనను కంగనా సిస్టర్ రంగోలీ ట్రోల్ చేయడంపై స్పదించిన తాప్సి ఆ వ్యాఖ్యలకు నేనేం బాధపడలేదు. ఎందుకంటే కంగనా పారితోషికం నా పారితోషికం కంటే చాలా ఎక్కువ. ఆ విషయంలో నేను చీపే అంటూ తనదైన శైలిలో కంగనా సిస్టర్ రంగోలికి కౌంటర్ ఇచ్చింది.

Show comments